ప్రముఖ నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్ఓ స్టేజ్ పై చేయి అందించగా.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిత్యా మీనన్ ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
అదే ఈవెంట్‌లో ఆమె డైరెక్టర్ మిష్కిన్‌ను ముద్దు పెట్టడం, హీరో జయం రవిని హగ్ చేసుకోవడం వివాదానికి కారణమైంది. దీంతో నెటిజన్లు ఆమెపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, “వ్యక్తుల స్థాయిని బట్టి ప్రవర్తించడం సబబు కాదు” అని విమర్శలు గుప్పిస్తున్నారు.
Never Expected this From her 💔🤡pic.twitter.com/LTagqhCkM6
— Arun Vijay (@AVinthehousee) January 9, 2025
ఈ ఘటనపై నిత్యా మేనన్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. నటి ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నవారితో పాటు, ఆమెను సమర్థించే వారూ కనిపిస్తున్నారు. ఎవరికైనా హ్యాండ్ ఇవ్వడం ఆమె వ్యక్తిగత ఇష్టమని నిత్యాకు సపోర్ట్ తెలుపుతున్నారు.








