షమీ మాజీ భార్య, కూతురిపై హత్యాయత్నం కేసు నమోదు!

షమీ మాజీ భార్య, కూతురిపై హత్యాయత్నం కేసు నమోదు!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, ఆమె కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్, అర్షి తనపై దాడి చేశారని దలియా ఖాతూన్ అనే మహిళ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సూరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో హసీన్, అర్షిపై BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హసీన్, అర్షి దలియా ఖాతూన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాదానికి కారణం ఏమిటి?
పశ్చిమ బెంగాల్‌లోని సూరి పట్టణం వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, ఆమె కుమార్తె అర్షి జహా నివసిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇటీవల వారు ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఈ స్థలం అర్షి పేరున రిజిస్టర్ అయ్యిందని వారు చెబుతున్నారు.

అయితే, ఆ స్థలం తమదని పక్కన నివసిస్తున్న దలియా ఖాతూన్ ముందుకు వచ్చింది. హసీన్ మొదలుపెట్టిన కట్టడాన్ని ఆమె ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఖాతూన్‌పై హసీన్, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తోంది.

భరణం కేసులో షమీకి ఇటీవల ఆదేశాలు
కాగా, ఇటీవలే హసీన్ జహాకు నెలకు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇందులో హసీన్ జహాకు రూ. 1.5 లక్షలు, కూతురు అర్షికి రూ. 2.5 లక్షలు చెల్లించాలని కోర్టు తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment