# Telugufeed.com > Every Moment, Every News – For Telugu! ## Posts - [కల్కి లో సాయి పల్లవి కీలక పాత్ర!](https://telugufeed.com/prabhas-kalki-2-sai-pallavi-key-role/): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ” మరియు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో “స్పిరిట్” సినిమాలతో పాటు, నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “కల్కి 2”పై సినిమా వర్గాల్లో ఆసక్తి చార్జ్ పెంచింది. ప్రత్యేకంగా, “కల్కి” మొదటి భాగంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె పోషించిన కీలక పాత్ర కోసం సీక్వెల్‌లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. అందుకే, ప్రస్తుతంలో సాయి పల్లవి ఆ పాత్రను తీసుకోవడానికి మేకర్స్ పరిశీలిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సాయి పల్లవి సహజ నటన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, డాన్స్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ పాత్రకు పర్ఫెక్ట్‌ ఫిట్ అవుతారని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు. దీపికా పదుకొణె పాత్రకు సీక్వెల్‌లో కొత్త కోణం ఇవ్వడం ద్వారా కథలో టెల్లింగ్ కొత్త రకాలుగా వెళ్లనుంది. ప్రభాస్–నాగ్ అశ్విన్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ... Read more - [మలయాళ స్టార్ పృధ్వీ సౌత్-నార్త్ మార్కెట్ ఫుల్ ప్లాన్!](https://telugufeed.com/prithviraj-sukumaran-back-to-back-releases-south-north-market/): ఇతర ఇండస్ట్రీల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ కారణంగా కేరళ ప్రేక్షకులపై పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రేమ కొంచెం తగ్గిందని తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ “ఎంపురన్2”లో కనిపించినప్పటికీ క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో పడింది. తర్వాత “విలయాత్ బుద్ద” సినిమా విడుదల అయ్యింది కానీ ప్రేక్షకుల దృష్టిలో నిలిచలేదు. దీంతో పృధ్వీ ప్రస్తుతం సొంత గూటికి కొంచెం దూరంగా, వారణాసి, దైరా వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నాడు. “ద గోట్ లైఫ్” మరియు “గురుర్ అంబలనడయిల్” తరువాత సోలో హీరోగా తన హిట్ రికార్డులు సరిగ్గా నిలిచలేకపోయడం కూడా కేరళ ఆడియన్స్‌తో టచ్ తగ్గడానికి కారణం కావచ్చునని పరిశీలనలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది పృధ్వీ సొంత గూటికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకొస్తున్నాడు. నిషామ్ బషీర్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఐ నోబడి” ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 20న ఖలీఫా ను రిలీజ్ చేయడానికి వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్-క్రైమ్ ... Read more - [దానం నాగేందర్ కు నోటీసులు](https://telugufeed.com/danam-nagender-disqualification-notice-telangana-politics/): తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్ట్ తీవ్రంగా గమనించడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 30న ఉదయం స్పీకర్ కార్యాలయంలో దానం నాగేందర్ హాజరు కావాలని ఆదేశించగా, అలాగే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ ఫిర్యాదుపై, మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. దానం నాగేందర్ కేసు ఇతర ఎమ్మెల్యేల కంటే ప్రత్యేకత కలిగి ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారు, ఇది స్పష్టమైన ఫిర్యాదు కిందకు వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు స్పీకర్ నిర్ణయం రాకముందే దానం ... Read more - [భీమవరం క్యాడర్‌తో జ‌గ‌న్ భేటీ.. కూట‌మిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు](https://telugufeed.com/jagan-meeting-with-bhimavaram-leaders-series-meetings/): చెప్పినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు నుంచి ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాలు.. ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్‌తో కొనసాగుతున్నాయి. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. భీమవరం నియోజకవర్గ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా, మూడు బడ్జెట్లు పెట్టినా ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని జగన్ మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వంలో ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన ఉండేదని, ... Read more - ['పవన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నా.. అది డీప్‌ఫేక్ వీడియో'](https://telugufeed.com/arava-sridhar-deepfake-video-controversy-janasenaparty/): జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాస‌లీల‌ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. మహిళా ఉద్యోగితో అసభ్యక‌రంగా ఉన్న‌ వీడియో కాల్స్ క్లిప్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అర‌వ శ్రీ‌ధ‌ర్ చీక‌టి బాగోతంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జనసేన పార్టీ అధికారికంగా స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా ఒక వీడియో విడుదల చేసి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న న్యూడ్ వీడియోలు అన్నీ డీప్‌ఫేక్ అని స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని అరవ శ్రీధర్ ... Read more - [ప్రొద్దుటూరు సీఐ బదిలీ… నిష్పక్షపాత విధులకు ‘బహుమానమా’](https://telugufeed.com/proddatur-ci-sriram-transfer-political-controversy/): వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి పోలీసు అధికారి బదిలీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ సీఐగా పనిచేస్తున్న శ్రీరామ్‌ను కేవలం నెలన్నర రోజుల్లోనే బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించినందుకే ఈ బదిలీ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీఐ శ్రీరామ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేకాట క్లబ్బులపై దాడులు, అక్రమ బెల్టు షాపుల మూసివేత వంటి చర్యలు తీసుకోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. గతంలో ఆయన పనితీరును చూసి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కూడా బహిరంగంగానే అభినందించిన విషయం తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతల అక్రమాలకు సహకరించలేదన్న కారణంతోనే శ్రీరామ్‌ను బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్‌ డే రోజునే డీఐజీ కోయ ప్రవీణ్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం మరింత వివాదానికి దారి తీసింది. ఇదే తరహాలో ఇటీవలే తమ మాట వినలేదన్న కారణంతో డీఎస్పీ ... Read more - [దేశంలో మరో విషాదం.. విమాన భద్రతపై మళ్లీ ప్రశ్నలు](https://telugufeed.com/maharashtra-ajit-pawar-plane-crash-aviation-safety-questions/): మహారాష్ట్ర రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఘోర విమాన ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆయనతో పాటు మరో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 8:45 గంటలకు ముంబైకి చెందిన VSR వెంచర్స్ సంస్థకు చెందిన ప్రైవేట్ చార్టర్డ్ విమానం బారామతి ఎయిర్‌పోర్ట్ సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలెట్లు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రాణాలు కాపాడే అవకాశం లేకపోయింది. అజిత్ పవార్ మృతి వార్త వెలువడగానే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు ... Read more - [గ్లోబల్ రేంజ్‌లో ప్రభాస్ హవా… రూ.7,132 కోట్ల మార్కెట్ విలువ](https://telugufeed.com/prabhas-global-market-value-7132-crores-top-indian-actor/): భారత సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతున్న వేళ, స్టార్ హీరోల మార్కెట్ విలువలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన నటుడిగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా కాదు… అంతర్జాతీయంగా కూడా భారీ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ మార్కెట్ విలువ సుమారు రూ.7,132 కోట్లుగా అంచనా వేయబడింది. ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ ప్రాజెక్టులు ప్రభాస్‌ను పాన్ ఇండియా ట్రెండ్‌కు ప్రతీకగా నిలబెట్టాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో షారుఖ్ ఖాన్ (రూ.4,124 కోట్లు) ఉండగా, అతనికి వెంటనే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ టాప్ 10లో ఉండటం విశేషం. ముఖ్యంగా ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ... Read more - [విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి](https://telugufeed.com/ajit-pawar-reported-plane-crash-baramati-dgca-response/): మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురు చనిపోయారు. ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు చనిపోయినట్లుగా డీజీసీఏ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి దగ్గర ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. విమానం పూర్తిగా బూడిదైంది. సంఘటనాస్థలికి స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తరలివచ్చి మంటలు ఆర్పారు. విమానం అయితే పూర్తిగా కాలిపోయింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ముంబై నుంచి బారామతికి వస్తుండగా ఉదయం 8:45 గంటలకు కూలిపోయినట్లుగా సమాచారం. ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి వెళ్లే క్రమంలో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని విమానం బూడిదైపోయింది. ప్రమాద దృశ్యాలను చూస్తుంటే.. ప్రమాద తీవ్రత ... Read more - [జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. ఇదేనా పవన్ ఇచ్చే శిక్షణ? వైసీపీ సంచ‌ల‌న కామెంట్స్‌](https://telugufeed.com/janasena-mla-arava-sridhar-video-controversy-women-safety/): జనసేన ఎమ్మెల్యే (Jana Sena Party MLA) అరవ శ్రీధర్ (Arava Sridhar) రాస‌లీల‌ల (Obscene) వీడియో రెండు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. మ‌హిళా ఉద్యోగితో న్యూడ్‌ (Nude)గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది. “ఇదేనా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే శిక్షణ?” అంటూ జనసేనపై ఘాటు విమర్శలు గుప్పించింది. ఒక మహిళా ఉద్యోగిని లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించడం దుర్మార్గమని వైసీపీ(YSRCP) పేర్కొంది. వేదికలపై మహిళల రక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ నేత‌లు… క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించింది. సొంత ఎమ్మెల్యేలనే అదుపులో పెట్టుకోలేని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రాన్ని, మహిళలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించింది. వరుదు ... Read more - [బంగ్లాదేశ్ జైల్లో బందీలైన మత్స్యకారులు విడుదల](https://telugufeed.com/bangladesh-jail-indian-fishermen-released-north-andhra/): బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులకు (23 Indian Fishermen) ఎట్టకేలకు విముక్తి లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ (Bangladesh Home Ministry) వీరి విడుదలకు అనుమతి ఇవ్వడంతో, ఉత్తరాంధ్రకు (North Andhra) చెందిన 9 మంది మత్స్యకారులకు, వారి కుటుంబాలకు ఊరట లభించింది. వీరిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లాకు చెందినవారే కావడంతో, ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో 14 మంది మత్స్యకారులను కూడా విడుదల చేశారు. భారత ప్రభుత్వ జోక్యం, రెండు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే ఈ విడుదల సాధ్యమైందని కుటుంబ సభ్యులు భావోద్వేగంగా తెలిపారు. బాగర్హాట్ జైలులో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేసిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్న వారి బోటుకు మరమ్మతులు ... Read more - [మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల](https://telugufeed.com/telangana-municipal-elections-2026-schedule-released/): తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini – State Election Commissioner) అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ... Read more - [జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో వైరల్ (Video)](https://telugufeed.com/janasena-mla-arava-sridhar-sexual-harassment-allegations/): మ‌హిళ‌ల (Women) జోలికి వ‌స్తే తాట‌తీస్తాం, అంతుచూస్తాం అని వార్నింగ్‌లు ఇచ్చే జ‌న‌సేన పార్టీ (Jana Sena Party)కి చెందిన ఓ ఎమ్మెల్యేకి సంబంధించిన రాస‌లీలల వీడియో (Sexual acts Video)సంచ‌ల‌నంగా మారింది. రైల్వే కోడూరుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar – MLA) న్యూడ్ వీడియో బ‌య‌ట‌ప‌డింది. దుస్తులు విపి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడ‌ని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగజార్చుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితురాలి వివరాల ప్రకారం… ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, మొదట పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి తనను లోబర్చుకున్నారని బాధితులు వెల్ల‌డించింది. అనంతరం తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ, దుస్తులు లేకుండా వీడియో ... Read more - [రాధాకృష్ణ రాతలపై రచ్చ.. పాత కాంగ్రెస్ మంత్రుల రహస్య భేటీ?](https://telugufeed.com/radhakrishna-writings-controversy-congress-ministers-secret-meeting-telangana/): తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆంధ్రజ్యోతి పత్రిక (Andhra Jyothy Newspaper) అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) రాస్తున్న కాలమ్స్‌ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. వార్తల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లోని మంత్రులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)పై ఇటీవల రాధాకృష్ణ రాసిన కథనాలు పెద్ద దుమారం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా రహస్య భేటీ (Secret Meeting) నిర్వహించినట్లు సమాచారం. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మీడియా కథనాల వెనుక ఉన్న కారణాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధ్రువీకరించారు. ... Read more - [అమెరికా మంచు తుఫాన్.. 29 మంది మృతి](https://telugufeed.com/us-blizzard-death-toll-29-power-outages-flight-cancellations/): అమెరికాలో శక్తివంతమైన మంచు తుఫాన్ ప్రాణాలకు ముప్పు ఏర్పరచి, ప్రజల జీవితాలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో పాటు తీవ్ర చలి నెలకొని, రహదారులు, విమానాలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల లక్షలాది ప్రజలు ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ తుఫాన్ ప్రభావం తీవ్రతను సూచించగా, ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 1,300 మైళ్ల పొడవైన ప్రాంతంలో ఒక అడుగుకు పైగా మంచు పొర ఏర్పడింది. ఫలితంగా అనేక హైవేలు మూసివేయడం, వేలాది విమానాలు రద్దు చేయడం, పాఠశాలలు మూతబడడం జరిగింది. సోమవారం తుఫాన్ తూర్పు దిశలో కదలడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మంచు మరింత పెరిగింది. చెట్లు కూలడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వల్ల లక్షలాది మంది చీకటిలో ఉండాల్సి వచ్చింది. మసాచుసెట్స్, ఓహియోలో మంచు తొలగించే స్నోప్లో వాహనాలు ఢీకొనడంతో ... Read more - [తమిళ బాక్సాఫీస్‌లోకి ఐకాన్ స్టార్ ఎంట్రీ](https://telugufeed.com/allu-arjun-atlee-tamil-box-office-pushpa3-upcoming-projects/): అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2 (Pushpa 2)తో టాలీవుడ్‌ మాత్రమే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత కూడా ఈ లెవల్‌ను కొనసాగించేందుకు, పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి తమిళ స్టార్ దర్శకుడు (Tamil Star Director) అట్లీకి (Atlee) అవకాశం ఇచ్చారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా బన్నీ తమిళ పరిశ్రమలో మరింత పట్టు సాధించి, అక్కడి బాక్సాఫీస్‌కి ప్రాబల్యం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అట్లీ, లోకేష్ వంటి స్టార్ దర్శకుల భాగస్వామ్యంతో సినిమా పాజిటివ్ హైప్ సృష్టిస్తోంది. అలాగే, బన్నీ టాలీవుడ్‌లో వేర్వేరు ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్‌లో పెట్టారు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్స్ ఇప్పటికే డిస్కషన్‌లో ఉన్నాయి. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ బన్నీ చేతికి ... Read more - [‘‘తెలియకనే రీల్స్ చేశా’’.. ఉపాధ్యాయురాలు గౌతమి](https://telugufeed.com/teacher-gowthami-suspension-reels-promotion-controversy/): మామిళ్లగూడెం (Mamilagudem) హైస్కూల్‌ (High School) ఉపాధ్యాయురాలు (Teacher) భూక్య గౌతమి రాథోడ్‌ (Bhukya Gauthami Rathod)ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగానే ప్రైవేట్‌ విద్యా సంస్థల (Private Educational Institutions) ప్రమోషన్‌కు సంబంధించిన యాడ్స్ చేశారన్న కారణంతో ఈ చర్య తీసుకున్నారు. సస్పెన్షన్‌పై గౌతమి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తెలియకనే రీల్స్ (Reels) చేశానని, మొదటిసారి ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పని చేయలేదని వాపోయారు. ‘‘సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని పిలిస్తేనే నేను వెళ్లాను. మా గవర్నమెంట్‌ స్కూల్‌కు అన్యాయం చేయను. నన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నేనేమైనా హత్యలు చేశానా? గంజాయి లాంటి వాటిని అమ్మానా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ట్రోలింగ్‌ జరుగుతుంటే మనస్థాపానికి లోనవుతున్నానని, తన సబ్జెక్టుకు ... Read more - [చంద్రబాబు స్కిల్ కేసు.. ఏసీబీ కోర్టులో కీలక పరిణామం](https://telugufeed.com/chandrababu-skill-development-scam-case-acb-court-orders-february-3/): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు (Skill Development Scam Case)ను క్లోజ్ చేయడంపై నేడు ఏసీబీ కోర్టు (ACB Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ (Mistake of Fact)గా పేర్కొంటూ క్లోజ్ చేసిన నిర్ణయంపై ప్ర‌ముఖ న్యాయ‌వాది, జై భీమ్ పార్టీ (Jai Bhim Party) వ్య‌వ‌స్థాప‌కులు జడ శ్రవణ్ (Jada Shravan) దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి 70 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో రిమాండ్ రిపోర్టుతో పాటు 48 కీలక డాక్యుమెంట్లను సీఐడీ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. అయితే ఆ తర్వాత ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ ఏసీబీ కోర్టు క్లోజ్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ... Read more - [భారత క్రికెట్‌లో అప్‌డేట్: కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఆయనేనా?](https://telugufeed.com/bcci-chief-selector-update-rp-singh-possible-appointment/): భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI)లో త్వరలోనే కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ (Ajit Agarkar) కాంట్రాక్ట్‌ను పొడిగించకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అగర్కర్ పనితీరుపై బీసీసీఐ పూర్తిగా సంతృప్తిగా లేదన్న సమాచారం నేపథ్యంలో, కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపికపై బోర్డు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ భారత పేసర్ ఆర్‌పీ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కథనం ప్రకారం, అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా ఆర్‌పీ సింగ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌పీ సింగ్‌కు క్రికెట్‌పై లోతైన అవగాహనతో పాటు యువ ప్రతిభను గుర్తించే సామర్థ్యం ఉందన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో ఉంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, ... Read more - ['అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్'](https://telugufeed.com/anasuya-temple-proposal-priest-comments-viral/): వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఆమెపై ఉన్న అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఓ పూజారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అనసూయకు ఆలయం కడతామురళీశర్మ (Murali Sharma) అనే పూజారి, అనసూయకు వీరాభిమాని (Die-Hard Fan)గా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, గతంలో తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి కట్టినట్లుగానే అనసూయకు కూడా ఆలయం (Temple) నిర్మించాలని తమ ఆలోచనగా వెల్లడించారు. అయితే దీనికి ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు అనసూయ పర్మిషన్ (Permission) కూడా తప్పనిసరిగా తీసుకుంటామని ... Read more - [వైఎస్ జగన్‌పై హోంమంత్రి ట్వీట్‌.. వెంటనే డిలీట్](https://telugufeed.com/home-ministers-brutal-tweet-on-former-cm-ys-jagan-anita-immediately-deleted-it-after-criticism-from-netizens/): ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన ఓ ట్వీట్‌ రాజకీయంగా కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో, ఆ పోస్ట్‌ను క్షణాల్లోనే డిలీట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్య‌మంత్రిని, ప్రతిపక్ష నేతను ఉద్దేశించి “బెంగళూరు అంకుల్” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం తగదని నెటిజన్లు మండిపడ్డారు. అది కూడా హోంమంత్రి హ్యాండిల్ నుంచి మార్ఫ్‌డ్ పోస్ట్ చేయ‌డంతో వ్య‌తిరేక‌త తీవ్ర‌మైంది. హోంమంత్రిగా ఉన్న వ్యక్తికి సరైన భాష కాదని, హోదాను మరిచి ఫ‌క్తు రాజకీయ విరోధిలా వ్యవహరించారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజ‌న్ల నుంచి పూర్తి వ్యతిరేకత పెరిగిపోవడంతో అనిత ఆ పోస్ట్‌ను వెంట‌నే తొలగించారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటు కౌంటర్హోంమంత్రి ట్వీట్‌పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి ... Read more - [ఫ్రెండ్స్‌ మ‌ధ్య సిగరెట్ లైటర్ గొడవ.. కారుతో ఢీకొట్టి హ‌త్య‌](https://telugufeed.com/karnataka-kammasandra-cigarette-lighter-fight-friend-killed-car-crime/): సిగ‌రెట్ లైట‌ర్ (Cigarette Lighter) విష‌యంలో ఇద్ద‌రు స్నేహితుల (Two Friends) మ‌ధ్య త‌లెత్తిన వివాదం ఒక‌రి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిగరెట్ లైటర్‌తో మొదలైన చిన్న గొడవ చివరకు విషాదంగా ముగిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారులో ఉన్న డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డవడం గమనార్హం. కమ్మసంద్రలో జరిగిన క్రికెట్ పోటీలకు హాజరైన స్నేహితులు ప్రశాంత్‌ (Prashanth) (35), రోషన్ హెగ్డే (Roshan Hegde) మ్యాచ్ ముగిసిన అనంతరం కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో సిగరెట్ లైటర్ విషయమై ఇద్దరి మధ్య మాటల తగాదా మొదలైంది. గొడవ ముదరడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్ర గాయమైంది. గాయాల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు రోషన్ తన కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని అడ్డుకునేందుకు ... Read more - [విజయ్ ‘జననాయగన్’కు మరో బిగ్ షాక్](https://telugufeed.com/vijay-jananayagan-movie-censor-case-high-court-shock/): తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన భారీ చిత్రం ‘జననాయగన్’ (Jananayagan)కు మరోసారి కోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. సినిమా సెన్సార్ (Censor) అంశంపై కీలక పరిణామం చోటుచేసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9న చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని CBFCను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు (Madras High Court) చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ‘జననాయగన్’ విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన U/A సర్టిఫికెట్ జారీ ఆదేశాలను చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేస్తూ, ఈ ... Read more - [కడపలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. దళితుల ఇల్లు కూల్చివేత (Video)](https://telugufeed.com/kadapa-tdp-mla-madhavi-reddy-followers-demolished-dalit-family-house-jcb/): అర్ధరాత్రి కడప నగరంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వందేళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబానికి చెందిన ఇంటిని రెండు జేసీబీలతో రాత్రికి రాత్రే పూర్తిగా నేలమట్టం చేశారని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని రోడ్డు మీద బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. క‌డ‌ప న‌గ‌రంలోని ఎర్ర‌ముక్క‌ప‌ల్లిలో భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిపై అర్ధరాత్రి దాడి జరిగింది. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి పడేసి, వెంటనే జేసీబీలతో ఇల్లు కూల్చివేసినట్లు బాధితులు వాపోతున్నారు. ముసలివారిని, చిన్నారులను కూడా కనికరం లేకుండా బయటకు తోసేసిన జేసీబీల‌తో ఇంటిని కూల్చేశారు. ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ... Read more - [రేవంత్ స‌ర్కార్‌పై బాంబు పేల్చిన కోదండరాం](https://telugufeed.com/growing-public-opposition-against-congress-government-kodandaram/): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ (Singareni Collieries Company Limited – SCCL)ను కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమ పార్టీకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఎలాంటి చర్చ జరపకపోవడం దురదృష్టకరమని కోదండరాం అన్నారు. ఇచ్చిన ఎమ్మెల్సీ పదవీ కూడా కోర్టు పరిధిలో ఉండటంతో తమకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇలాగే కాంగ్రెస్ వ్యవహారం కొనసాగితే మిత్రపక్షం నుంచి బయటకు వచ్చి, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన ... Read more - [కాస్టింగ్ కౌచ్‌.. చిరు వ్యాఖ్య‌ల‌కు చిన్మయి షాకింగ్ కౌంటర్](https://telugufeed.com/chinmayi-counter-to-chiranjeevi-comments-casting-couch/): చిరంజీవి (Chiranjeevi) ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ (Mana Shankara Varaprasad) సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సినిమా పరిశ్రమ అద్దంలాంటిదని, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ (Casting Couch) లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పట్ల గౌరవం వ్యక్తం చేస్తూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న అసలు వాస్తవాలను ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. కమిట్‌మెంట్ అర్థం ఇదేనా?చిన్మయి తన పోస్ట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండస్ట్రీలో వినిపించే ‘కమిట్‌మెంట్’ (Commitment) అనే పదానికి వృత్తిపరమైన నిబద్ధత అనే అర్థం కాదని, అది మహిళల శరీరాలపై పెట్టే ఒత్తిడికి సంకేతంగా మారిందని పేర్కొన్నారు. అవకాశాలు రావాలంటే మహిళలు తమ శరీరాన్ని అర్పించాల్సిందే అన్న భావన చాలా చోట్ల సహజంగా మారిపోయిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తరం ... Read more - [Cast in Fear.. Dalits under siege in .](https://telugufeed.com/dalits-under-siege-andhra-pradesh/): Introduction Andhra Pradesh is witnessing a disturbing rise in violence, humiliation, and institutional neglect against Dalits since the coalition government assumed office. From murderous attacks and social boycotts to police brutality and land encroachments, Dalit lives across districts are being pushed into fear and insecurity. The brutal killing of Dalit activist Manda Salman in Palnadu’s Pinnelli village has now become the most chilling symbol of what many describe as a systematic collapse of protection for the marginalised. ⸻ Murder that shook Palnadu Manda Salman, a Dalit activist, was allegedly attacked with iron rods by TDP-linked elements in Pinnelli village and ... Read more - [స్పిరిట్‌లో ప్ర‌భాస్‌ తండ్రిగా చిరంజీవి.. నిడివి ఎంతంటే..?](https://telugufeed.com/chiranjeevi-as-prabhas-father-in-spirit-movie/): రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Director Sandeep Reddy Vanga) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతున్నాడనే టాక్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తృప్తి డిమ్రి (Tripti Dimri) నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న స్పిరిట్‌ను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమా విడుదలవుతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్‌లో చిరంజీవి స్పెషల్ రోల్?స్పిరిట్ సినిమాతో సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ... Read more - ['మ‌త‌మార్పిడుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్' - ప‌వ‌న్‌పై పూనమ్ సంచ‌ల‌న కామెంట్స్‌](https://telugufeed.com/poonam-kaur-fire-on-pawan-kalyan-gurudwara-controversy/): ఛాన్స్ దొరికిన ప్ర‌తీసారి న‌టి పూన‌మ్ కౌర్ (Poonam Kaur) డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan)ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతుంటారు. తాజాగా నాందేడ్ (Nanded)లోని గురుద్వారాను పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా (Anna Lezhneva) సందర్శించిన సందర్భంగా వెలువడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిపై స్పందించిన పూనమ్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పవన్ కల్యాణ్‌ను “మతమార్పిడులకు (Religious Conversions) బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించిన ఆమె, ట్విట్టర్ (Twitter) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి, సిక్కుల మతానికి చెందిన గురుతేగ్ బహదూర్ జీ (Guru Tegh Bahadur Ji)ను ప్రార్థించాల్సిన చివరి వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆమె ట్వీట్ చేశారు. పూనమ్ వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ ఎవరినీ మతమార్పిడి చేయించలేదని, ... Read more - [గవర్నర్‌తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం](https://telugufeed.com/ysrcp-velampalli-srinivas-slams-governor-speech-coalition-government-lies/): గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో (Republic Day celebrations) గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ (Governor Abdul Nazeer) ప్ర‌సంగం త‌ప్పుల త‌డ‌క అని వైసీపీ (YSRCP) అభిప్రాయ‌ప‌డింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్‌తో కూడా కూటమి ప్రభుత్వం అసత్యాలు మాట్లాడించిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (Velampalli Srinivasa Rao) తీవ్రంగా విమర్శించారు. రిపబ్లిక్ డే రోజున కూడా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పించటం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అబద్ధాలతోనే రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ (Super Six)పేరుతో ప్రజలను మోసం చేశారని తెలిపారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని వెలంప‌ల్లి విమర్శించారు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది ... Read more - [స్వర్ణాంధ్ర–2047 దిశగా 'కూటమి' అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్](https://telugufeed.com/ap-governor-abdul-nazeer-swarna-andhra-2047-amaravati-vision/): అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్పష్టమైన దిశ లేకుండా నిలిచిపోయిందని, రాజధాని నిర్మాణం ఆగిపోవడం వల్ల ఆర్థిక విశ్వాసం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే చంద్ర‌బాబు ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. కాలానుగుణంగా పాలన మారాలనే సిద్ధాంతంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి క్షణాల్లో పాలన ప్రజల వద్దకు చేరేలా వ్యవస్థను రూపుదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికతో ముందుకెళ్తోందని, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యమని గవర్నర్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4వేలకు పెంచామని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు ... Read more - [పద్మశ్రీ నా పూర్వజన్మ సుకృతం.. - నటుడు రాజేంద్రప్రసాద్](https://telugufeed.com/padma-shri-rajendra-prasad-reaction-telugu-cinema/): తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad)కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ (Padma Shri) పురస్కారం ఆయన జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా మారింది. ఈ గౌరవం తన వ్యక్తిగత విజయం కాదని, తెలుగు హాస్యానికి, వినోదాన్ని ఆదరించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం త‌న‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించడం త‌న జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు అని చెప్పారు. ఇది త‌న పూర్వజన్మ సుకృతం అని, ఈ గౌరవం త‌నకు మాత్రమే దక్కిందని అనుకోవడం లేదని, తెలుగు హాస్యానికి, ప్రేక్షకుల ప్రేమకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. కళలను గౌరవించి, తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అసలు కారణం ప్రేక్షకులే. గత 48 ... Read more - [ప్రిన్సిప‌ల్ ఇంట్లో ఫంక్ష‌న్‌.. గురుకుల విద్యార్థిని మృతి](https://telugufeed.com/bansuwada-gurukul-school-student-dies-after-falling-from-auto/): సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Social Welfare Girls Gurukula School) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నుంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (Sangeetha) (14) మృతి చెందింది. ఈ ఘటనతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్‌లోని గురుకుల స్కూల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన సంగీత మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన బాలిక‌గా గుర్తించారు. వివ‌రాల్లోకి వెళితే.. బోర్లం క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత‌ 8వ తరగతి చదువుతోంది. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ (In-charge Principal) సునీత (Sunitha) ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ (Function) కోసం పాఠశాల నుంచి ఫర్నిచర్‌ను ఆటోలో తరలించారు. ఫంక్ష‌న్ అనంత‌రం ఆ ఫర్నిచర్‌ను తిరిగి పాఠశాలకు తీసుకొస్తున్న క్రమంలో సంగీత కూడా ఆటోలో ప్రయాణించింది. ఈ సమయంలో ఆటో నుంచి జారి పడిన సంగీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలంలోనే ... Read more - [అనిల్‌కి చిరంజీవి ఖరీదైన కానుక.. కారు ధ‌ర ఎంతో తెలుసా..?](https://telugufeed.com/chiranjeevi-gifts-range-rover-sport-to-anil-ravipudi-mana-shankara-varaprasad-garu-success/): మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi)కి చిరంజీవి ప్రత్యేకమైన గిఫ్ట్‌ (Special Gift)తో సత్కరించారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి, అనిల్ రావిపూడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ (Ultra-Premium Range Rover Sport) కారును బహుమతిగా అందించారు. ఈ లగ్జరీ కార్ మార్కెట్ విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. సినిమా ఇచ్చిన ఘన విజయానికి గుర్తుగా చిరు ఇచ్చిన ఈ ఖరీదైన కానుక సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కారు ... Read more - ['తమాషాగా ఉందా?'.. విశాఖ ఉత్స‌వ్‌లో క‌లెక్ట‌ర్‌పై రెచ్చిపోయిన మేయ‌ర్ (Video)](https://telugufeed.com/visakha-utsav-protocol-row-mayor-peela-srinivasa-rao-collector/): విశాఖ ఉత్సవ్ (Vizag Utsav) ప్రారంభోత్సవం వేదికగా ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. నగర మేయర్ (City Mayor) పీలా శ్రీనివాసరావు (Peela Srinivasa Rao), జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ హరేందిరప్రసాద్ (Harendira Prasad) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో వేదికపై కూర్చోవడం విషయంలో కలెక్టర్ మేయర్‌ను కొద్దిగా పక్కకు కూర్చోగలరని సూచించినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ తీవ్రంగా స్పందించారు.“నేను నగర ప్రథమ పౌరుడిని. నన్ను కూర్చున్న చోటు నుంచి లేపి పక్కకు వెళ్లమంటావా? ప్రొటోకాల్ అంటే ఏంటో తెలుసా?” అంటూ కలెక్టర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రుల సమక్షంలోనే హడావుడిఈ ఘటన హోంమంత్రి అనిత (Anitha) సమక్షంలోనే జరిగింది. మేయర్ ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ ... Read more - [131 మందికి 'ప‌ద్మ' అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది](https://telugufeed.com/padma-awards-2026-winners-list-telugu-states-highlights/): గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 131 మంది ప్రముఖులు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించగా, విదేశీయులు, ఎన్నారైల విభాగంలో 6 మంది చోటు దక్కించుకున్నారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సైన్స్, ప్రజా వ్యవహారాలు, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఈసారి కేంద్రం గౌరవించింది. పద్మవిభూషణ్‌కు ఐదుగురుదేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఈసారి ఐదుగురిని వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రసింగ్ దేవల్ (మహారాష్ట్ర) (Dharmendra Singh Deol ... Read more - [అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్‌.. సిరీస్ గెలిచిన టీమిండియా](https://telugufeed.com/india-clean-sweep-new-zealand-3rd-t20-abhishek-sharma-bumrah-show/): న్యూజిలాండ్‌ (New Zealand)తో సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన నిరాశను టీమిండియా (Team India) టి20ల్లో ఘనంగా తుడిచేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో (T20s) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ 8 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి, 3–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చాప్‌మన్‌ (32), కెప్టెన్‌ సాంట్నర్‌ (27) చివర్లో వేగం పెంచారు. భారత బౌలింగ్‌లో ప్రపంచకప్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా తన క్లాస్‌ చూపించాడు. కేవలం 17 పరుగులకే 3 వికెట్లు తీసి కివీస్‌ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేశాడు. హార్దిక్‌ ... Read more - [తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం](https://telugufeed.com/tirupati-dalit-girl-rape-town-house-hotel-instagram-case/): టెంపుల్ సిటీ తిరుప‌తి (Tirupati)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు (Peruru)కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి (19-year-old Dalit woman)పై కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు అత్యాచారం (Sexual Assault) చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం మేరకు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతిని నిందితుడు మాయమాటలు చెప్పి తిరుపతిలోని టౌన్ హౌస్ హోటల్‌ (Town House Hotel)కు తీసుకెళ్లాడు. అక్కడ హోటల్ రూమ్ నెంబర్ 114లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం తీవ్ర మానసిక వేదనకు గురైన బాధిత యువతి, తన తల్లితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. అత్యాచారం జరిగిన టౌన్ హౌస్ హోటల్‌కు పోలీసులు చేరుకుని, క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. ఘటనపై క్రైమ్ నెంబర్ ... Read more - [Satyameva Jayate!Tirumala Laddu Lies Collapse, Truth Explodes](https://telugufeed.com/tirumala-laddu-controversy-cbi-sit-verdict-truth-prevails/): The malicious campaign unleashed by Chandrababu Naidu and his camp over the sacred Tirumala laddu has finally collapsed. What was aggressively projected as a “ghee adulteration scandal” has now been exposed as a web of blatant falsehoods. The CBI-led SIT appointed by the Supreme Court has categorically stated that there was no use of animal fat and no involvement whatsoever of YSRCP or the former TTD chairmen. The truth has emerged clearly: the Tirumala laddu controversy was nothing but a politically motivated conspiracy that dragged Lord Venkateswara Swamy into petty politics. ⸻ CBI SIT Verdict: YSRCP Has No Role The ... Read more - ['కలియుగ దైవంతోనే ఆటలా..?'.. కూట‌మిపై శ్రీవారి భక్తుల ఆగ్రహం](https://telugufeed.com/tirumala-laddu-animal-fat-allegations-false-sit-report/): పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara Swamy) వారి లడ్డూ (Laddu)కు సంబంధించి కూటమి ప్రభుత్వం (Alliance Government) చేసిన ఆరోపణలు ఇప్పుడు బూటకమని తేలిపోయాయి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్య నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ వివాదంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా కోర్టుకు సమర్పించిన నివేదికలో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక వెలుగులోకి రావడంతో, అప్పట్లో జరిగిన దుష్ప్రచారంపై భక్తుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. టీటీడీ లడ్డు విషయంలో విషప్రచారం చేసి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పగలడా? pic.twitter.com/RP4RZEbhvH — వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ (@_Ysrkutumbam) January 24, 2026 రాజకీయాల కోసం దేవుడి ... Read more - [టార్గెట్ భట్టి.. రాధాకృష్ణ రాత‌ల వెనుక 'ముఖ్య నేత' ఎవ‌రు..?](https://telugufeed.com/bhatti-vikramarka-targeted-radhakrishna-writings-behind-congress-leader/): కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) సన్నిహితుడిగా, నిఖార్సైన కాంగ్రెస్ నేత (Committed Congress Leader)గా గుర్తింపు పొందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సొంత పార్టీలోని ఒక ‘ముఖ్య నేత’ కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ ముఖ్య నేత తన పాత మిత్రుడు, ప్రముఖ పత్రికాధిపతితో కలిసి భట్టిపై విషపు రాతలు రాయిస్తున్నారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. చంద్ర‌బాబు (N. Chandrababu Naidu)కు, ఆయ‌న పార్టీకి కొమ్ముకాసే ప‌త్రిక భ‌ట్టిపై గురిపెట్ట‌డం వెనుక బ‌ల‌మైన దురుద్దేశం ఉంద‌ని మండిప‌డుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై రెచ్చిపోయి క‌ల్పిత‌ కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి (Andhra Jyothy) ఎండీ రాధాకృష్ణ (Radhakrishna – MD), ఇప్పుడు అదే తరహాలో భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని ... Read more - [‘సప్త సాగరాలు దాటి’ నుంచి ‘కాంతార 2’ వరకు: రుక్మిణి వసంత్](https://telugufeed.com/rukhmini-vasanth-kannada-hit-movies-from-sapta-sagaralu-dati-to-kantara-2/): నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా కన్నడ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో రుక్మిణికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది మంది అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. సింపుల్ లుక్స్, స్పష్టమైన అభిప్రాయాలు, సినిమాల ఎంపికలో చూపించే పరిపక్వత వల్ల యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా రుక్మిణి దగ్గరైంది. ఆమె చేసే పాత్రల ఎంపికే ఆమెకు బలమైన అభిమాన వర్గాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. రుక్మిణి వసంత్ నటించిన సినిమాల్లో ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’ (Sapta Sagaradaache Ello – Side A) ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ‘సప్త సాగరాలు దాటి ... Read more - [ముంబై ఆడిషన్ల నుంచి ఓటీటీ వరకు.. శోభిత](https://telugufeed.com/sobhita-dhulipala-journey-mumbai-auditions-to-ott-cheekatilo/): ‘గూఢచారి (Goodachari), మేజర్ (Major)’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ(OTT) చిత్రంగా ‘చీకటిలో’ (Cheekatilo) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాడ్ కాస్ట్ లో తన కెరీర్ గురించి మాట్లాడిన శోభిత, తాను ముంబై (Mumbai) వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి తన ప్రయాణం ప్రారంభించానని, ఒక ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి అనే లెక్కలు ఎప్పుడూ వేసుకోలేదని స్పష్టం చేసింది. నటిగా కొనసాగాలంటే పాత్ర నచ్చడం చాలా ముఖ్యమని, బేరాలు-లెక్కలు వేస్తే ఇండస్ట్రీలో నిలబడటం కష్టమని అభిప్రాయపడింది. అనురాగ్ కశ్యప్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పని చేయడం తనకు గొప్ప సంతృప్తినిచ్చిందని చెప్పింది. అలాగే ‘చీకటిలో’ ట్రైలర్‌ను నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తాను చేసిన పాత్రకు వంద శాతం న్యాయం చేసానని, ఫలితాన్ని ... Read more - [కొడుకును కాపాడబోయి.. బావిలో ప‌డి తండ్రీకొడుకులు మృతి](https://telugufeed.com/mahabubabad-balram-thanda-father-son-died-in-agriculture-well-accident/): మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి (Father) కూడా ప్రాణాలు కోల్పోవడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహబూబాబాద్ మండలం బలరాం తండా (Balaram Thanda)లో వ్యవసాయ బావి (Agricultural Well) వద్దకు వెళ్లిన కేలోత్ మదన్ (Keloth Madan (40), అతని రెండేళ్ల కుమారుడు జస్వంత్ (Jaswanth) ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన తండ్రి మదన్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుమారుడిని కాపాడేందుకు బావిలోకి దూకాడు. అయితే, లోతైన బావి కావడంతో ఇద్దరూ బయటకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న తండావాసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం తండ్రి మదన్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే, బాలుడు జస్వంత్ మృతదేహం కోసం బావిలో ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో బలరాం తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ... Read more - [నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో మంటలు](https://telugufeed.com/nampally-fire-accident-furniture-shop-hyderabad/): హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి (Nampally)లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలోని సెల్లార్‌లో ఉన్న హోల్‌సేల్ ఫర్నిచర్ షాపు (Wholesale Furniture Shop)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసరాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భవనంలో పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో ఉద్రిక్తత నెలకొనగా, స్థానిక యువకులు సాహసం చేసి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక వాహనాలు (Four Fire Tenders) ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, భవనం ఇరుకైన సందులో ఉండటం, సెట్‌బ్యాక్ (Setback Space) లేకపోవడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది పక్క భవనాల గోడలపైకి ... Read more - [త‌గ్గించుకునే త‌త్వం బోధ‌ప‌డింది.. ఇషాన్ కిషన్ సాలిడ్ కంబ్యాక్](https://telugufeed.com/ishan-kishan-comeback-story-team-india-bcci-domestic-cricket/): ఒకప్పుడు తలబిరుసుతనం, క్రమశిక్షణ లోపం కారణంగా టీమిండియా (Team India) జట్టు నుంచి పక్కకు నెట్టివేయబడిన ఇషాన్ కిషన్ (Ishan Kishan)… ఇప్పుడు అదే క్రికెట్ ప్రపంచానికి తన ఆటతో బలమైన సమాధానం చెబుతున్నాడు. తాను చేసిన తప్పులను గుర్తించి, హెడ్ వెయిట్ తగ్గించుకొని, పూర్తిగా ఆటపై దృష్టి పెట్టితే ఎలా కంబ్యాక్ (Comeback) ఇవ్వొచ్చో చూపిస్తున్న ప్రత్యక్ష ఉదాహరణ ఇషాన్ కిషన్. బీసీసీఐ (BCCI) ఆదేశాలను లెక్కచేయకుండా దేశవాళీ క్రికెట్ (రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ) ఆడకపోవడం వల్ల ఇషాన్ కిషన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నాడు. మానసిక అలసట (Mental Fatigue) కారణంగా విరామం తీసుకున్నప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న బోర్డు సూచనలను అతడు పట్టించుకోలేదు. దీంతో 2024 సీజన్ నుంచి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి ఇషాన్ కిషన్‌ను తొలగించింది. రంజీ ట్రోఫీకి దూరంగా ఉండి ఐపీఎల్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం ... Read more - [మాధవిలతపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఫిర్యాదు](https://telugufeed.com/complaint-against-madhavi-latha-shirdi-sai-devotees-bjp-telangana/): సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలత (Madhavi Latha)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao)కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక (Shirdi Sai Devotees United Forum) ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ.. శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు. సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి శిరిడి సాయి బాబా ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. మంచికంటి ధనుంజయ (Manchikanti Dhanunjaya),శిరిడి సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది సరికాదు.. సాయి బాబా ఆలయంలో జరిగేవి ... Read more - [విద్యాబాలన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్](https://telugufeed.com/vidya-balan-comments-religion-social-media-viral/): సోషల్ మీడియా (Social Media) యుగంలో ప్రతి చిన్న వ్యాఖ్యనూ నెట్టింట తారాస్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ (Vidya Balan) చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె భారతదేశం (India) మతపరంగా విడిపోయింది అని వ్యాఖ్యానించగా, పూర్వం దేశానికి ఇంతటి మతపరమైన గుర్తింపు ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కొన్ని నెటిజన్లలో ప్రశ్నలు, విమర్శలను రేకెత్తించగా, కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ, నిజమైన ఆధ్యాత్మికత దాతృత్వం మరియు సామాజిక సేవలో ఉందని తేల్చారు. విద్యాబాలన్ అంతేకాదు, తాను ఆధ్యాత్మికతకు అత్యంత నమ్మకంతో ఉన్నప్పటికీ, గుడులు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలకు విరాళాలు ఇవ్వనని, కేవలం ఆసుపత్రులు, పాఠశాలలు, టాయిలెట్లు నిర్మాణాలకు సహాయం చేస్తానని స్పష్టం చేశారు. ఆమె ఈ వివరణతో కొంతమందిలో ఆశ్చర్యాన్ని, కొందరికి ఆగ్రహాన్ని కలిగించగా, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు భారీ చర్చలకు దారితీస్తున్నాయి. ... Read more - [జైల్లో ప్రేమ.. పెళ్లికి 15 రోజుల పెరోల్‌.. - క్రైమ్ థ్రిల్లర్‌లా హంతకుల కథ](https://telugufeed.com/jail-love-story-murder-convicts-marriage-alwar-rajasthan/): ఇద్దరూ హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. ఒకరు అత్యంత దారుణంగా తన ప్రియుడిని (Boyfriend) హత్య చేసిన మహిళ. మరొకరు ఐదుగురిని హతమార్చిన నిందితుడు. జైలు (Prison) గోడల మధ్య మొదలైన ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్ హైకోర్టు నుంచి 15 రోజుల అత్యవసర పెరోల్‌ (Parole)ను కూడా పొందారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే కథలో వధువు ప్రియా సేథ్ (Priya Seth) అలియాస్ నేహా సేథ్ (Neha Seth), వరుడు హనుమాన్ ప్రసాద్ (Hanuman Prasad). ఇద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలి ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. డేటింగ్ యాప్ పరిచయం.. భయంకర హత్యమోడల్‌గా పనిచేసిన ప్రియా సేథ్, 2018లో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా సింగ్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అతడిని ... Read more - [సింగరేణిపై 'ఆంధ్రజ్యోతి అబద్ద కథలు'! భట్టి విక్రమార్క ఆగ్రహం](https://telugufeed.com/singareni-coal-block-bhatti-vikramarka-fires-back-fake-stories/): తెలంగాణ (Telangana) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సింగరేణి (Singareni), నైని బొగ్గు బ్లాక్ (Naini Coal Block) విషయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాధారమైన సింగరేణిపై పలు కట్టుకథలు, అబద్ద లేఖలు, రివ్యూలు వస్తున్నాయని, ఇవి 42 వేల సింగరేణి ఉద్యోగులు మరియు 20 వేల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మోరల్‌ను దెబ్బతీస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, తప్పు ప్రచారం, పత్రికల్లో (Newspapers) నిరంతరం సృష్టించబడే కథల వల్ల సింగరేణి పైన నిందలు మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరి ప్రయోజనార్థం ఈ కథలు వస్తున్నాయో గుర్తించాల్సిందిగా కుదిరిన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క తెలిపారు, సింగరేణి నిర్ణయాలు మంత్రుల వద్దకు రాకుండా, స్వతంత్ర సంస్థగా పారదర్శకంగా జరుగుతుందని. ఇటీవల టెండర్ ప్రక్రియలో సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన పెట్టబడిన విషయం, గతంలో ... Read more - [బంగ్లాదేశ్‌కి మరో షాక్ ఇచ్చిన ఐసీసీ](https://telugufeed.com/icc-shocks-bangladesh-t20-world-cup/): టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup)లో బంగ్లాదేశ్‌ (Bangladesh)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఐసీసీ (ICC). మ్యాచ్‌ల వేదికలను మార్చిన నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) (BCB) ఇచ్చిన అప్పీల్‌ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ) (DRC) తిరస్కరించింది. డీఆర్‌సీ పేర్కొన్నది ఏమిటంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై కమిటీకి విచారణ చేసే అధికారమే లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాలు, డీఆర్‌సీ నిబంధనల ప్రకారం, ఇప్పటికే 14-2 మెజారిటీతో ఐసీసీ బోర్డు భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఓటింగ్‌లో నిర్ణయించుకుంది. బీసీబీ ఇప్పటివరకు మార్చకపోవడంతో, టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడటంతో, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారిక ప్రకటన ఈ రోజు (జనవరి 24) వెలువడే అవకాశం ఉంది. అయితే బీసీబీ చివరి ఆర్మ్‌గా స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లే ... Read more - [దొరికిపోయిన కానిస్టేబుల్.. స‌న్మానం బూమ‌రాంగ్‌..!!](https://telugufeed.com/jaya-shanti-constable-fake-ews-certificate-home-minister-controversy/): రంగంపేట (Rangampeta) మహిళా కానిస్టేబుల్ (Woman Constable) జయశాంతి (Jayasanti) వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదంగా మారింది. చంటి బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియో ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఆమెకు మద్దతుగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండ‌డంతో హోంమంత్రి అనిత (Anitha) జయశాంతి దంప‌తుల‌ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరీ సన్మానించి, ఆ వీడియోను బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే, హడావుడి వెనుక అసలు కథ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ (DSC)లో జయశాంతి తప్పుడు ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ అధికారులు నిర్ధారించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త తాతారావు (Thatarao) ఆదాయాన్ని దాచిపెట్టి, తండ్రిని సంరక్షకుడిగా చూపుతూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు విచారణలో తేలింది. దీంతో జయశాంతికి మంజూరైన డీఎస్సీ ... Read more - [ఇంట్లో మల్లె పెడితే పాములు వస్తాయా? అసలు సత్యం ఇదే!](https://telugufeed.com/jasmine-plants-snakes-myth-truth/): ఇంట్లో మల్లె మొక్కలు ఉంటే పాములు వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది ప్రజల్లో అపోహ ఉంది. ముఖ్యంగా ఇంటి ముందులో పెరిగిన మల్లె మొక్కల చుట్టూ పాములు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నమ్మకం బలంగా ఉంది. అయితే శాస్త్రీయ అధ్యయనాలు ఏం చూపిస్తున్నాయంటే, మల్లె వాసన పాములను నేరుగా ఆకర్షించదు. నిజానికి, మల్లె చెట్ల చుట్టూ తేమ, చిన్న కీటకాలు, ఎలుకలు వంటి వనరులు ఉంటాయి, ఇవే పాములను ఆకర్షించే కారణం కావచ్చు. మల్లె మొక్కల ఉపయోగాలు & భయం తొలగించండి మల్లె మొక్కలు కేవలం అందం మరియు సువాసనకు మాత్రమే కాదు, పూజలలో, అలంకారంలో, మరియు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మహిళలు మల్లె పువ్వులను తల్లో పెట్టి అలంకరిస్తారు, పూల వాసన వలన ఇంట్లో సుఖం కలుగుతుంది. కాబట్టి, మల్లె మొక్కలను భయంతో తీసేయకండి. సమస్య వాస్తవానికి పాములు కాకుండా, ... Read more - [గంజాయి ముఠా అరాచకం.. మహిళా కానిస్టేబుల్‌పై దాడి](https://telugufeed.com/nizamabad-drug-gang-attack-female-constable/): గంజాయి ముఠా (Ganja Gang) అమానుషపు అరాచకానికి తెగపడింది. నిర్మల్ (Nirmal) కు చెందిన ముఠా సభ్యులు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వాళ్లని పట్టుకునేందుకు నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య (Soumya) ప్రయత్నించింది. పోలీసుల నుంచి తప్పుంచుకునేందుకు ముఠా గుంపు కానిస్టేబుల్ (Woman Constable) సౌమ్యని కారుతో ఢీకొట్టింది. ఈ ఘాతుకర ఘటనలో సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స ప్రారంభించారు. ఘటనపై సమగ్ర విచారణలో, ఎక్సైజ్ పోలీసులు మహమ్మద్ సోఫియోడ్డిన్ (Mohammad Sofiyoddin), సయ్యద్ సాయల్ (Syed Sayal) అనే ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసులు, నిర్మల్ ప్రాంతంలో ఈ ముఠా కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ ధైర్యం దేశవ్యాప్తంగా ప్రశంసనీయమని, చట్టం పై నిరంతర నిబద్ధతకు ఒక స్పష్టమైన సందేశం అని ... Read more - [శ్రీ‌వారి భక్తులతో ఆటలు.. కూట‌మి నేత‌లు క్ష‌మాప‌ణ‌లు చెబుతారా..?](https://telugufeed.com/tirumala-laddu-ghee-adulteration-controversy-alliance-govt-prayaschitta-issue/): తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateswara Swamy) భక్తకోటిని దారుణంగా తప్పుదోవ పట్టించి, వారి విశ్వాసాలను గాయపరిచిన ఘటనపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. లేని విషయాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించిన కూటమి నాయకులు, తాము చేసిన దుష్ప్రచారానికి బాధ్యత వహించాలా? కనీసం భక్తులను క్షమాపణ అడిగే సంస్కారం అయినా వారిలో ఉందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో నెల‌కొన్నాయి. తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో ఉపయోగించే నెయ్యి (Ghee)లో కల్తీ జరిగిందనే అంశం బయటకు వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. కల్తీ నెయ్యి కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టుకు సమర్పించిన తుది చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పామాయిల్‌ (Palm Oil)లో కెమిక‌ల్స్‌ (Chemicals) కలిపి కల్తీ చేసినట్టు నిర్ధారణ అయింది. జంతువుల కొవ్వులు, వ్యర్థాలు కలిశాయన్న ఆరోపణలకు ఆధారాలు ... Read more - [Flop Show @Davos.. Two Years, Two Trips, Zero Investments](https://telugufeed.com/davos-visits-fail-to-bring-investments-for-andhra-pradesh/): For two consecutive years, 2025 and 2026, Chief Minister Chandrababu Naidu and his son Lokesh travelled to the World Economic Forum at Davos. The outcome for Andhra Pradesh is stark: zero investments. Investors have turned away from the state. Under the shadow of “Red Book” culture and the excesses of coalition leaders, confidence has collapsed. Instead of announcing projects, the yellow media is now scrambling, unable to figure out how to cover up yet another embarrassing failure. Chandrababu has gone to Davos many times in the past, each visit accompanied by grand promises and loud hype. Today, even his supporters ... Read more - [నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట](https://telugufeed.com/jogi-ramesh-brothers-get-bail-in-fake-liquor-case/): నకిలీ మద్యం (Illicit Liquor) కేసులో జోగి రమేష్ (Jogi Ramesh) సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము (Jogi Ramu)కు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఇదివరకే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జోగి రమేష్ సోదరులు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. 2025 నవంబర్ 2వ తేదీన జోగి రమేష్ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయవాడ, నెల్లూరు జైళ్లలో 82 రోజుల పాటు వారు రిమాండ్‌లో ఉన్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో లభ్యమైన నకిలీ మద్యం కేసుతో పాటు, భవానీపురంలో లభించిన నకిలీ మద్యం కేసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్‌రావు, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి పేర్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే, ఈ కేసులో కీలకంగా ... Read more - [టెలివిజన్ నుంచి టాలీవుడ్ వరకు: మృణాల్ ఠాకూర్](https://telugufeed.com/mrunal-thakur-journey-from-television-to-tollywood/): మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిభావంతమైన మరియు బహుముఖ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె తన కెరీర్‌ను కుంకుమ్ భాగ్య (Kumkum Bhagya) వంటి ప్రముఖ హిందీ టెలివిజన్ సీరియల్స్‌ (Hindi Television Serials)తో ప్రారంభించి, అనంతరం సినిమాల (Films) వైపు విజయవంతంగా అడుగులు వేసింది. లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మృణాల్, ఆ సినిమాలో చూపిన భావోద్వేగభరిత నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం సూపర్ 30, బట్లా హౌస్, జెర్సీ (తెలుగు), సీతా రామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ టాప్ స్టార్లతో కలిసి నటిస్తూ, విభిన్నమైన పాత్రలను అన్వేషిస్తోంది. సీతా రామం మరియు హాయ్ నాన్న చిత్రాల ఘన విజయం తర్వాత, తెలుగు సినీ పరిశ్రమలో ... Read more - [వైఎస్ జగన్ భూ సంస్కరణలకు అంతర్జాతీయ ప్రశంస (Video)](https://telugufeed.com/ys-jagan-land-reforms-praised-at-world-economic-forum-gita-gopinath/): వైసీపీ (YSRCP) అధినేత‌ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చేపట్టిన భూ సంస్కరణలకు (Land Reforms) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. దావోస్‌ (Davos)లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) చర్చాలో ఏపీ ప్రభుత్వం అమలు చేసిన క్లీన్ ల్యాండ్ టైటిలింగ్ విధానాలను ఇండియన్–అమెరికన్ ప్రముఖ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ (Gita Gopinath) బహిరంగంగా అభినందించారు. డిబేట్ సందర్భంగా గీతా గోపినాథ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల విషయంలో చాలా బాగా చేసింది. ల్యాండ్ టైటిల్ స్పష్టత తీసుకురావడంలో, భూముల లావాదేవీలను సులభతరం చేయడంలో రాష్ట్రం ఎంతో క్రియేటివ్ విధానాలు అవలంభించింది” అని ప్రశంసించారు. ముఖ్యంగా క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం చేసిన కృషి అభినందనీయమని ఆమె స్పష్టం చేశారు. ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏపీ ... Read more - [నా తర్వాత సినిమాకి పారితోషికం తీసుకోను](https://telugufeed.com/sharwanand-next-movie-no-salary-announcement/): శర్వానంద్ (Sharwanand) ‘నారీ నారీ నడుమ మురారి’ (Naari Naari Naduma Murari) సినిమా విజయాన్ని పరిగణనలోకి తీసుకుని సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలో టైటిల్ ఖరారు చేయడం నుండి ముహూర్తం షాట్ వరకు ఆయనకు ప్రేరణ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీనియర్ హీరోల ఆశీస్సులు తన విజయానికి ప్రధాన కారణం అని హర్షంగా పేర్కొన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభం లో సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా, కేవలం మౌత్ టాక్ వల్లనే సినిమా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నదని తెలిపారు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అదేవిధంగా, నిర్మాత అనిల్ (Producer Anil Sunkara) సుంకరపై గౌరవాన్ని చాటుతూ, తదుపరి చిత్రం కోసం ఒక్క రూపాయి కూడా ... Read more - [విద్యార్థిని 7 నెలల గర్భవతి.. మాజీ డిప్యూటీ సీఎం సంచలన ట్వీట్‌](https://telugufeed.com/inter-student-7-months-pregnant-kurupam-eklavya-school-pushpa-sreevani-tweet/): ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో గిరిజన పాఠ‌శాల‌ (Tribal School)లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కురుపాం (Kurupam) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో (Ekalavya Model Residential School) చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఏకంగా 7 నెలల గర్భవతి అని బ‌య‌ట‌ప‌డ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విష‌యాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ(YSRCP) నేత పాముల పుష్పశ్రీ వాణి (Pamula Pushpa Sreevani) బ‌య‌ట‌పెడుతూ సంచలన ట్వీట్ చేశారు. “దేవుడా… ఇదేం దారుణం!” అంటూ ట్వీట్ చేసిన పుష్పశ్రీ వాణి, ఏడు నెలలుగా విద్యార్థిని గర్భవతి (Pregnant)గా ఉన్నా పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, వైద్య సిబ్బంది ఎవరికీ ఇది గుర్తించకపోవడం విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులంలో జరగడం మరింత బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి సంధ్యారాణి నెలరోజుల క్రితం గిరిజన ... Read more - [పవన్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టుకి..ఎందుకంటే?](https://telugufeed.com/pawan-kalyan-son-akira-nandan-delhi-high-court-ai-abuse/): ఈ కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడం చాలా మందికి కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, కొందరికి ఇది సమస్యగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా ఉపయోగించి ఆర్థిక లాభాలు పొందడం, దుర్వినియోగం కొనసాగించడం పెద్ద సమస్యగా మారింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) కూడా ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. అకీరా ఇప్పటివరకు సినీ పరిశ్రమలో అడుగు పెట్టకపోయినా, సోషల్ మీడియాలో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది అతని ఫోటోలు, వీడియోలు, వాయిస్ ఏఐ టెక్నాలజీ (AI Technology) ద్వారా దుర్వినియోగం చేస్తుండటం వల్లే అకీరా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అకీరా తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడం, తన అనుమతి లేకుండా ఏదైనా అసభ్యకర కంటెంట్ ప్రచురించడం, వ్యాప్తి చెందకుండా ... Read more - [వసంత పంచమి వేడుకలు.. వేలాది భక్తులతో బాసర పుణ్యక్షేత్రం](https://telugufeed.com/basara-vasanta-panchami-celebrations-thousands-of-devotees/): నిర్మల్ జిల్లా (Nirmal District)లోని బాసర పుణ్యక్షేత్రం (Basara Temple) వసంత పంచమి సందర్భంలో భక్తుల రద్దీ (Devotee Rush)తో కిక్కిరిసిపోగా, తెల్లవారుజాము నుంచే గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక శోభ నిండింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి, ఆలయ పరిసరాలను “సరస్వతీ మాతా కీ జై” (Saraswati Mata Ki Jai) నినాదాలతో మారుమోగించుకున్నారు. ఆలయ అర్చకులు శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళి దేవతలకు శాస్త్రోక్త అభిషేకాలు, మంగళవాయిద్య సేవలు పూర్తి చేసి, అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యా దేవత సరస్వతీ సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం భక్తుల నమ్మక ప్రకారం అత్యంత శుభప్రదమని భావిస్తారు. అలానే, వేలాది తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ... Read more - [టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి షాక్.. గోవాలో గంగారాం అరెస్ట్‌](https://telugufeed.com/tdp-mla-daggubati-prasad-shock-follower-gangaram-arrest-goa/): రోజుకో కొత్త వివాదంతో టీడీపీ (Telugu Desam Party) ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ (Daggupati Prasad) వార్త‌ల్లో నిల‌వాల్సిందే. బెదిరింపులు, బూతుల ఆడియోల‌తో వెంట‌నే అడ్డంగా దొరికిపోవ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. సెలబ్రెటీల‌ను, వ్యాపారుల‌ను, మ‌హిళ‌ల‌ను, సామాన్య ప్ర‌జ‌ల‌ను బండ‌బూతులు తిట్టినా, పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే ప‌నులు చేసినా, ఆయ‌న‌పై కేసులుండ‌వూ.. చ‌ర్య‌లు అంత‌క‌న్నా ఉండ‌వూ. అందుకు ఎన్టీఆర్ వార్‌-2 సినిమాను అడ్డుకునే ఉదంతం నుంచి ఎగ్జిబిష‌న్ నిర్వ‌హ‌కుడికి బెదిరింపు, నంబూరి వైన్స్‌కు నిప్పు, అస్ర క్లీనిక్ డాక్ట‌ర్‌ ఆడియో క్లిప్ వ‌ర‌కు జ‌రిగి ఉదాహ‌ర‌ణ‌లే సాక్ష్యాలు. మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు స‌న్నిహితుడు కావ‌డంతోనే ద‌గ్గుపాటి ప్ర‌సాద్‌పై చ‌ర్య‌లుండ‌వ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, అనంతపురం అర్బన్ టీడీపీ(TDP) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్య అనుచరుడిగా పేరున్న టీడీపీ నేత గంగారాం (Gangaram)ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. గంగారాం‌ను గోవా నుంచి అనంతపురానికి తరలించేందుకు ... Read more - [“ఎన్డీఏ త‌మిళ‌నాడు ద్రోహి” – మోదీ పోస్ట్‌కు స్టాలిన్ కౌంటర్‌](https://telugufeed.com/modi-post-stalin-counter-tamil-nadu-nda-politics/): తమిళనాడు (Tamil Nadu) ఎన్‌డీఏ (NDA)తోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మధురాంతకం‌లో జరిగే ఎన్‌డీఏ ర్యాలీలో తాను పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన మోదీ, అవినీతిలో మునిగిపోయిన డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు చెప్పాలని తమిళనాడు నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ పాలన విజయాలు, ప్రాంతీయ ఆశయాల పట్ల నిబద్ధత ప్రజల హృదయాలను తాకుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ వేడిని పెంచాయి. అయితే ప్రధాని పోస్ట్‌కు తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin) ఘాటుగా స్పందించారు. ఎన్‌డీఏ చేసిన ద్రోహాల లెక్కను తమిళనాడు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని వ్యాఖ్యానిస్తూ మరో పోస్ట్ చేశారు. సమగ్ర శిక్ష నిధులు, డీలిమిటేషన్ హామీలు, గవర్నర్ వ్యవహారం, తమిళ భాషకు నిధులు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, మదురై ఎయిమ్స్, ప్రకృతి విపత్తుల సహాయం, హోసూరు విమానాశ్రయం, మెట్రో ... Read more - [“పదిసార్లు పిలిచినా వస్తా” - సిట్ నోటీసులపై కేటీఆర్ సవాల్](https://telugufeed.com/ktr-sit-notices-phone-tapping-case-telangana-politics/): ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు సిట్ నోటీసులు (SIT Notices) జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. నేడు సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేటీఆర్(KTR), హరీష్ రావు (Harish Rao) అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఏమాత్రం నిజం లేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని, ఇది పూర్తిగా ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న కుట్రేనని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనతో పాటు మంత్రులు, బీఆర్ఎస్(BRS) నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.50 లక్షల నోటుకు ఓటు కేసులో దొరికిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇలాంటి రాజకీయ కక్ష ... Read more - [బ్లాక్ చీరలో స్మృతి మంధానా, గోల్డ్ గౌన్‌లో లారెన్ బెల్!](https://telugufeed.com/rcb-womens-team-glamorous-event-smriti-mandhana-lauren-bell-wpl-2026/): ఇటీవల బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు నిర్వహించిన గ్లామరస్ ప్రమోషనల్ ఈవెంట్ అభిమానులను ఆకట్టుకుంది. జట్టు కెప్టెన్ స్మృతి మంధానా (Smriti Mandhana) బ్లాక్ సీక్విన్ చీర (Black Sequin Saree)లో మెరిసిపోగా, ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ (Lauren Bell) గోల్డ్ హాల్టర్ గౌన్‌ (Gold Halter Gown)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు–బంగారు థీమ్ నేపథ్యంతో జరిగిన గ్రూప్ ఫోటోషూట్‌లో జట్టు ఐక్యత, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయి. ఆటతో పాటు స్టైల్‌లోనూ RCB అమ్మాయిలు తమదైన ముద్ర వేసారు. మైదానంలోనూ ఈ జట్టు అదే జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి WPL 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం విశేషం. స్మృతి మంధానా బ్యాట్‌తో చెలరేగుతూ పరుగుల వరద పారిస్తుండగా, లారెన్ బెల్ తన వేగవంతమైన బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొడుతోంది. ఈ ప్రదర్శనలతో RCB ... Read more - [పాట్నా లేడీస్ హాస్ట‌ల్స్‌ డార్క్ సీక్రెట్‌.. దేశవ్యాప్తంగా చ‌ర్చ‌](https://telugufeed.com/patna-girls-hostels-dark-secret-flesh-trade-bihar/): బిహార్ రాజధాని పాట్నా (Patna)లో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన విష‌యం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్య కోసం, నీట్‌ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే ఆశతో అనేక మంది అమ్మాయిలు పాట్నాకు వస్తుంటారు. కానీ, కొన్ని బాలిక‌ల‌ హాస్టళ్లలో (Girls Hostels) చదువు ముసుగులో సంఘటిత లైంగిక అక్రమ రవాణా (ఫ్లెష్ ట్రేడ్) (Flesh Trade) నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమాయక యువ‌తులు బలి?హాస్ట‌ల్ జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై బయటపడుతున్న వివరాలు భయానకంగా ఉన్నాయి. చదువు కోసం హాస్టళ్లలో చేరిన అమ్మాయిలే ఈ రాకెట్‌కు లక్ష్యంగా మారుతున్నారు. మొదట చిన్న పనుల పేరుతో, ఆ తర్వాత మెల్లగా అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎదురు తిరిగితే మానసిక వేధింపులు, బెదిరింపులు, కొన్నిసార్లు డబ్బు, మాయ‌మాట‌ల‌తో మోసం చేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ల అమానుషత్వంఈ అక్రమ రాకెట్‌లో పనిచేస్తున్న ఏజెంట్ల వ్యవహారం మానవత్వానికే మ‌చ్చ‌ తెప్పిస్తోంది. వయస్సు, శారీరక ... Read more - [పట్టాభి వైఖరి.. గుండెపోటుతో GVMC ఉద్యోగి మృతి! (Video)](https://telugufeed.com/gvmc-engineer-govindarao-death-during-pattabhi-review-meeting/): తెలుగుదేశం పార్టీ నేత‌(Telugu Desam Party), స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ (Swachh Andhra Corporation) ప‌ట్టాభి (Pattabhi) వైఖ‌రి ఓ సీనియ‌ర్ ఇంజినీరింగ్ అధికారి నిండు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గ్రేట‌ర్ విశాఖ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) (GVMC) సూపరింటెండింగ్ ఇంజనీర్ GVMC) జి. గోవిందరావు (G. Govindarao), ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి నిర్వహించిన సమీక్షలో గుండెపోటు (Heart Attack)తో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెంచుతూ, భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడమే ఈ దారుణానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీనియ‌ర్ అధికారి గోవిందరావుపై స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ట్టాభి తీవ్రంగా విరుచుకుపడుతూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాస్త సమయం ఇవ్వాలని, పత్రాలు చూసుకుని సమాధానాలు చెబుతానని గోవిందరావు వేడుకున్నా పట్టాభి వినకుండా అరవడంతో ఒక్కసారిగా ... Read more - [ICC హెచ్చరికల మధ్య బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం](https://telugufeed.com/t20-world-cup-2026-bangladesh-ban-india-matches-icc-warning/): టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 World Cup 2026) నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం (Bangladesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించరాదు అని బోర్డు స్పష్టంగా ప్రకటించింది. ఢాకాలోని హోటల్ కాంటినెంటల్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) సమావేశం నిర్వహించి, భారతదేశంలో భద్రతా పరిస్థితులు తగినంత స్థిరంగా లేనందున మ్యాచ్‌లు అక్కడే ఆడకూడదని నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై పెద్ద ప్రభావం చూపనుంది. ఇకపుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్‌ను హెచ్చరించింది. భారత్‌లోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాలని ICC నిర్ణయించినప్పటికీ, భద్రతా కారణాలను పట్టుకుని బంగ్లాదేశ్ ఈ నిర్ణయాన్ని విస్మరించింది. ICC, బంగ్లాదేశ్ నిర్ణయంపై ఎలా స్పందించనుందో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం భవిష్యత్ టోర్నీ షెడ్యూల్ మరియు జట్ల ప్లానింగ్‌పై కీలక ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. - [Historic land resurvey hijacked.. YS Jagan exposes Naidu’s Credit Chori](https://telugufeed.com/ys-jagan-exposes-naidu-credit-theft-historic-land-resurvey/): Former Chief Minister and YSR Congress Party President Y.S. Jagan Mohan Reddy on Thursday launched a scathing attack on Telugu Desam Party chief N. Chandrababu Naidu, accusing him of shamelessly stealing credit for Andhra Pradesh’s historic comprehensive land resurvey while having no role whatsoever in building the system. Addressing a media conference at the YSRCP central office in Tadepalli, YS Jagan said his government never thrived on propaganda like Chandrababu, but instead created permanent, technology-driven systems that empowered farmers, resolved land disputes, and delivered tamper-proof land records. He asserted that the comprehensive land resurvey undertaken by his government was nothing ... Read more - [విజయ్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు కేటాయింపు](https://telugufeed.com/vijay-party-tamizhaga-vetri-kalagam-whistle-election-symbol/): తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ (Vijay) స్థాపించిన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) (Tamilaga Vettri Kazhagam – TVK)కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. టీవీకే పార్టీకి అధికారికంగా విజిల్ (Whistle) గుర్తును కేటాయించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల ‘జననాయగన్’ సినిమా వివాదం, సీబీఐ విచారణ వంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్న విజయ్, తన పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై పరిశీలించిన ఈసీ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు పూర్తయ్యాయని నిర్ధారించి టీవీకేకు విజిల్ గుర్తును కేటాయించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే గానీ, బీజేపీతో గానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని విజయ్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళ్ ... Read more - [500 అంతర్జాతీయ విజయాలతో భారత స్టార్‌ షట్లర్ రికార్డు!](https://telugufeed.com/pv-sindhu-500-international-wins-record/): భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) తన క్రీడా జీవితంలో మరో అద్భుత ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో 500 మ్యాచ్ల్లో విజయం (500 International Match Wins) సాధించిన అరుదైన భారత మహిళా షట్లర్‌ (Indian Woman Shuttler)గా సింధు నిలిచింది. ఇటీవల ఇండోనేషియా మాస్టర్స్‌లో విజయం సాధిస్తూ ఈ మైలురాయిని దాటిన ఆమె, మహిళ సింగిల్స్‌లో ఇప్పటివరకు ఐదుగురికి మాత్రమే సాధ్యమైన రికార్డును సృష్టించింది. ఈ ఘనతతో పీవీ సింధు ఆరో షట్లర్‌గా ఈ రికార్డ్‌ని సొంతం చేసుకుంది. సింధు ఈ ఘనతతో కేవలం భారత మహిళా షట్లర్‌గా మాత్రమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా శతాబ్దం రికార్డులో తన పేరు నిలుపుకుంది. తొలి భారతీయురాలిగా 500 అంతర్జాతీయ విజయాల ఘనతను సాధించిన పీవీ సింధు, యువ క్రీడాకారిణులకు మార్గదర్శకంగా నిలిచింది. ఆమె కష్టపడి సాధించిన విజయాలు, నిరంతర శ్రమ మరియు అద్భుతమైన ప్రతిభ ... Read more - ['భూసర్వేపై చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. చ‌రిత్ర‌ను ఎవ‌రూ చెర‌ప‌లేరు'](https://telugufeed.com/ys-jagan-slams-chandrababu-over-land-resurvey-credit-row/): ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సమగ్ర భూరీసర్వే (Land Resurvey) అంశంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రీసర్వే వంటి మహత్తర కార్యక్రమానికి సంబంధించి చేయని పనికి చంద్రబాబు క్రెడిట్‌ (Credit) తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన పాలనలో ఒక్కసారైనా సమగ్ర భూరీసర్వే చేయాలన్న ఆలోచన రాలేదని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు, రైతుల భూమి వివాదాలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఎప్పుడూ చూపని చంద్రబాబు, ఇప్పుడు పూర్తిగా అమలైన రీసర్వే ఘనతను తన ఖాతాలో వేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. రీసర్వే ఒక మహాయజ్ఞంఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర రీసర్వే ప్రక్రియకు 2020 డిసెంబరు 21న శ్రీకారం ... Read more - [మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కొత్త సాంకేతికత.. ఆకాశం నుంచి దర్శన అవకాశం](https://telugufeed.com/medaram-sammakka-saralamma-jathara-digital-services-helicopter-view/): తెలంగాణ కుంభమేళా (Telangana Kumbh Mela)గా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Sammakka–Saralamma Jatara) కోసం ఈసారి ములుగు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. జాతర చరిత్రలో తొలిసారిగా భక్తులు వాట్సాప్ ద్వారా అన్ని వివరాలు పొందగలుగుతారు. 7658912300 అనే నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా జాతర ప్రాంగణం, దర్శన సమయాలు, ట్రాఫిక్ మార్గాలు, పార్కింగ్, రవాణా మరియు అత్యవసర సేవల వివరాలను నేరుగా మొబైల్ ఫోన్‌లో పొందవచ్చు. ఈ డిజిటల్ చాట్ బాట్ ద్వారా భక్తులు దారి తప్పడం, అనుకోని ఇబ్బందులు ఎదురవడం వంటి పరిస్థితుల్లో తక్షణ పరిష్కారం పొందగలుగుతారు. జాతరలో భక్తుల సౌకర్యాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను (Helicopter Services) కూడా అందిస్తోంది. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా భక్తులు ఆకాశం నుండి 6–7 నిమిషాల పాటు జాతర ప్రాంగణాన్ని వీక్షించవచ్చు. ఒక్కోరు ... Read more - [జమ్ము కశ్మీర్‌లో ప్ర‌మాదం.. ఆర్మీ జ‌వాన్లు మృతి](https://telugufeed.com/jammu-kashmir-doda-army-vehicle-accident-soldiers-dead/): భారత ఆర్మీ సైనికులు (Indian Army Soldiers) దేశ భద్రత, ప్రజల సంక్షేమం కోసం ధైర్యం, నిస్వార్థ త్యాగం, అంకితభావంతో సేవచేస్తూ, ఘోరమైన పరిస్థితుల్లో కూడా జాతీయ గౌరవం కాపాడతారు. దేశం కోసం కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ నిరంతరం దేశ రక్షణ కోసం పాటుబడతారు. జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir) దోడా జిల్లా (Doda District)లో ఘోరమైన ఆర్మీ వాహన ప్రమాదం (Army Vehicle Accident) చోటు చేసుకుంది. దోడా జిల్లాలోని లోయల్లో ఒక ఆర్మీ వాహనం నియంత్రణ కోల్పోని పరిస్థితిలో 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో పదిమంది సైనికులు (Ten Soldiers) మృతిచెందారు. అదనంగా, 9 మంది సైనికులు గాయపడ్డారు. ఫోరెంట్‌ల్‌ వర్గాల ప్రకారం, గాయపడిన సైనికులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనతో దోడా జిల్లా భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అధికారులు ... Read more - [సుప్రీంకోర్టు క్రేజీ రియాక్షన్.. టీం ఇండియా పిటిషన్‌పై ఆగ్రహం](https://telugufeed.com/supreme-court-reacts-team-india-petition-angry/): బీసీసీఐ (BCCI) ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ జట్టు (Cricket Team)ను ‘టీం ఇండియా’(Team India)గా పిలవకుండా ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court of India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు అప్రయోజనకరమైన పిటిషన్లతో భారం భరించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. న్యాయస్థానాల విలువైన సమయాన్ని వృథా చేయడం ఏ విధంగానూ సహించబోమని, ఇలాంటి కేసులు ఇతర న్యాయస్థానాలకు ప్రసీడెంట్స్ గా మారకూడదని కోర్టు హెచ్చరించింది. పిటిషన్ దాఖలైన వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో చర్చలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆగ్రహపు స్పందనపై క్రికెట్ అభిమానులు, న్యాయ వర్గాలు హాట్ రియాక్షన్ చూపుతున్నారు. బీసీసీఐ నేతృత్వంలోని జట్టు, ఇలాంటి ఆర్డర్స్ అవసరం లేకుండా ‘టీం ఇండియా’గా పిలవడం సాంప్రదాయం అని, దీనిని అడ్డుకోవడం సాధ్యంకాదని కోర్టు చెప్పింది. దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ తీర్పును సమర్థిస్తూ సోషల్ ... Read more - [ఏపీలో మ‌రో బస్సు ద‌గ్ధం.. ముగ్గురు మృతి](https://telugufeed.com/three-charred-to-death-in-bus-accident-in-nandyal-district/): ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరోసారి ఘోర బ‌స్సు ప్ర‌మాదం (Bus Accident) చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో ప్రమాదానికి గురి కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారి లగేజీ మొత్తం అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కి బయలుదేరిన ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ARBCVR Private Travels Bus) బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణం మధ్యలో బస్సు టైరు పేలడంతో డ్రైవర్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే బస్సుకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ... Read more - [నమ్రతకు మహేశ్ బాబు ఎమోషనల్ విషెస్..](https://telugufeed.com/mahesh-babu-emotional-birthday-wishes-to-namrata-shirodkar/): టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సతీమణి, మాజీ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) నేడు (జనవరి 22) 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా భార్యకు ఎమోషనల్ బర్త్‌డే విషెస్ (Emotional Birthday Wishes) తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో “హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ (Happy Birthday NSG).. ప్రతి విషయంలోనూ వెలకట్టలేని ప్రేమతో, ఓపికతో నా వెంటే నిలబడుతున్నావు. అంతకంటే ఎక్కువ నేను కోరుకోలేను” అంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సెలబ్రిటీలు నమ్రతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నమ్రత–మహేశ్‌ది ప్రేమ వివాహం కాగా, వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారి 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమై కుటుంబానికే తన సమయాన్ని ... Read more - [రాజమౌళి–మహేశ్ కాంబో ‘వారణాసి’.. 2027 రిలీజ్ ఫిక్స్!](https://telugufeed.com/rajamouli-mahesh-babu-varanasi-movie-2027-release/): భారత సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’ (Varanasi) మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027లో విడుదల కానుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మహేశ్ బాబు ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో టైటిల్‌ను రివీల్ చేసిన మేకర్స్, అప్పుడే విడుదల సంవత్సరాన్ని కూడా ప్రకటించారు. అయితే షూటింగ్ షెడ్యూల్‌పై వచ్చిన సందేహాలకు చెక్ పెడుతూ, 2027 రిలీజ్‌పై మరోసారి స్పష్టత ఇచ్చారు. పవిత్ర నగరం వారణాసి నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికత, చరిత్ర, భావోద్వేగాల సమ్మేళనంగా ఉండబోతుందన్న అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. 2027లో ఉగాది లేదా శ్రీరామనవమి సందర్భంగా సినిమా ... Read more - [గ్రూప్-1 వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్.. తీర్పు వాయిదా](https://telugufeed.com/telangana-group-1-case-high-court-verdict-postponed/): ఇవాళ తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) వ్యవహారంలో కీలకంగా మారాల్సిన హైకోర్టు (High Court) తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పు ఇంకా సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేస్తూ, గ్రూప్-1పై ప్రకటించాల్సిన నిర్ణయాన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం ముడిపడి ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. టీజీపీఎస్సీ (TSPSC) 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ సెలెక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ (Single Bench), సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. గత నెల 30న వాదనలు పూర్తిగా వినిన డివిజన్ బెంచ్ ఇవాళ తుది ... Read more - [భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలతో టైమ్ పాస్](https://telugufeed.com/wife-kills-husband-over-extra-marital-affair-chiluvuru-guntur/): ప్రియుడి మోజులో ప‌డి భర్తను చంపిన సైకో భార్య‌ (Psycho Wife).. రాత్రంతా పోర్న్ వీడియోల (Porn Videos)తో కాల‌క్షేపం చేస్తూ కూర్చొంది. తెల్ల‌వారేసారికి త‌న భ‌ర్త గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని నమ్మించి ప్ర‌య‌త్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ కిరాత‌క‌ ఘ‌ట‌న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. వివ‌రాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం చిలువూరులో లోకం శివనగరాజు (Lokam Sivanagaraju) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మొదట గుండెపోటుగా భావించిన ఈ ఘటనలో, మృతదేహంపై కనిపించిన గాయాలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలింది. శివనగరాజుకు 2007లో లక్ష్మీ మాధురి (Lakshmi Madhuri)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబంతో కలిసి చిలువూరులో జీవనం సాగిస్తున్నారు. శివనగరాజు ఉల్లిపాయల వ్యాపారం ... Read more - [బాలిక శీలానికి లక్ష రూపాయల ఒప్పందం?](https://telugufeed.com/minor-girl-assault-case-chennur-kadapa-police-political-interference/): వైఎస్సార్ కడప జిల్లా (YSR Kadapa District) చెన్నూరు మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది. లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురై న్యాయం కోసం పోలీసులను(Police) ఆశ్రయించిన ఓ బాలికకు (Minor Girl) అండగా నిలవాల్సిన వ్యవస్థే, రాజకీయ నేతలతో కలిసి నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనలో టీడీపీ(TDP) నేతలు, స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చెన్నూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. కొన్నేళ్ల క్రితం తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తల్లితో కలిసి జీవిస్తోంది. ఇదే గ్రామంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగి బాలికను మాయమాటలతో లోబర్చుకుని, ఆపై బెదిరింపులు చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను తట్టుకోలేక బాధిత బాలిక చివరకు చెన్నూరు ... Read more - [సీఈవో పదవికి దీపిందర్ గోయిల్ రాజీనామా](https://telugufeed.com/deepinder-goyal-resigns-eternal-ceo-albinder-dhindsa-appointed/): జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ (Deepinder Goyal) ఎటర్నల్ గ్రూప్ (Eternal Group) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) (CEO) పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు సమాచారం ఇచ్చింది. వాటాదారులకు రాసిన లేఖలో దీపిందర్ గోయిల్ తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఇటీవల తాను అధిక రిస్క్‌తో కూడిన, ప్రయోగాత్మక స్వభావం కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడవుతున్నానని తెలిపారు. అలాంటి ఆలోచనలు పబ్లిక్ కంపెనీ పరిమితులకు వెలుపల ఉంటేనే సమర్థంగా అమలు చేయవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్‌కు సంబంధించిన బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయని, అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం తనకు లభించడం లేదని గోయిల్ ... Read more - [ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టు.. కొలికపూడి ఫైర్ (Video)](https://telugufeed.com/sc-st-entrepreneurs-arrest-apiic-mangalagiri-kolikapudi-srinivasa-rao-fire/): తమకు ప్రభుత్వం (Government) ప్రకటించిన రాయితీలు (Incentives), బకాయిలు (Pending Dues) వెంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు (SC, ST Entrepreneurs) చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ (APIIC Building) ఎదుట ధ‌ర్నా చేస్తున్న పారిశ్రామిక‌వేత్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టును టీడీపీ(TDP) తిరువూరు ఎమ్మెల్యే (Tiruvuru MLA) కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తీవ్రంగా ఖండించారు. బకాయిల కోసం పోరాటం చేస్తున్న పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఆందోళన సమయంలో పలువురు ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. “ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయల రాయితీలు, మాఫీలు ఇస్తున్న ప్రభుత్వం… మాకు మాత్రం ఎందుకు న్యాయం చేయడం లేదు?” అని పారిశ్రామిక ... Read more - [People regret Naidu’s rule](https://telugufeed.com/people-regret-naidu-rule-ys-jagan-criticism-coalition-government/): Former Chief Minister and YSR Congress Party President Y.S. Jagan Mohan Reddy said there is intense public resentment against the Chandrababu-led coalition government and that in every household people are now discussing how governance was better during the YSRCP regime. He announced that he will launch another padayatra after one and a half years and will remain continuously among the people for nearly one and a half years. He also declared that he will meet party workers from one constituency every week. YS Jagan was speaking at a meeting with local body representatives and party activists of the Eluru Assembly ... Read more - [సింగరేణికి సంపూర్ణ ప్రక్షాళన అవసరం : కేంద్ర మంత్రి](https://telugufeed.com/union-minister-kishan-reddy-demands-complete-cleanup-of-singareni/): సింగరేణి కాలరీస్ సంస్థ(Singareni Collieries Company Limited)లో సంపూర్ణ ప్రక్షాళన జరగాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సింగరేణి వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణిలో జరిగిన అన్ని లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఒడిశా (Odisha State)లోని నైనీ కోల్ బ్లాక్‌ (Naini Coal Block)ను సింగరేణికి అప్పగించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఆ కోల్ బ్లాక్ మైనింగ్ విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని, టెండర్లను ఆహ్వానించి మళ్లీ రద్దు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని మండిపడ్డారు. ... Read more - [మరోసారి తండ్రి కాబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు](https://telugufeed.com/us-vice-president-jd-vance-to-become-father-again/): అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్‌ (Usha Vance) కూడా ధృవీకరించడంతో వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వాన్స్ దంపతులు త్వరలోనే తమ నాలుగో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. జులై చివరి నాటికి పండంటి మగబిడ్డ వారి కుటుంబంలోకి రానున్నట్లు సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించారు. 2014లో వివాహం చేసుకున్న జేడీ–ఉషా వాన్స్‌లకు ఇప్పటికే ఈవాన్‌, వివేక్‌, మిరాబెల్‌ అనే ముగ్గురు పిల్లలు (Three Children) ఉన్నారు. నాలుగో సంతానంతో వారి కుటుంబం మరింత ఆనందంగా మారనుంది. We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7 — Second Lady Usha Vance (@SLOTUS) January ... Read more - [ఏబీ వెంకటేశ్వరరావుకు జనసేన నేత బహిరంగ సవాల్](https://telugufeed.com/bolisetti-satyanarayana-open-challenge-to-ab-venkateswara-rao-amaravati-issue/): అమరావతి రాజధాని(Amaravati Capital) అంశంపై తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని జనసేన పార్టీ (Jana Sena Party) నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ డీజీపీ (Former DGP) ఏబీ వెంకటేశ్వరరావు (A.B. Venkateswara Rao)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన, అసత్య ఆరోపణలు మానుకుని వాస్తవాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన బొలిశెట్టి, ఏబీ వెంకటేశ్వరరావు వీడియోను పోస్ట్ చేస్తూ “దమ్ముంటే నిరూపించండి.. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పండి” అని డిమాండ్ చేశారు. “మీరు కలుగులో దాక్కున్న సమయంలో నేను ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాను” అంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో తన వైఖరి ఎప్పటికీ స్పష్టమేనని బొలిశెట్టి వెల్లడించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం తాను నిరంతరం ... Read more - [NASA నుంచి సునీతా విలియమ్స్ రిటైర్](https://telugufeed.com/sunita-williams-nasa-retirement-space-legend/): సునీతా విలియమ్స్ (Sunita Williams) ఒక అమెరికన్ వ్యోమగామి (NASA astronaut) మరియు విడుదలైన U.S. నేవీ అధికారిణి. ఆమె 1998లో NASAలో అస్ట్రోనాట్‌గా ఎంపికై, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ (ISS) పై మూడు మిషన్లలో పాల్గొన్నారు. ఆమె నౌకాదళ్ కెప్టెన్‌ (Naval Captain)గా సేవలందించారు. ఆమె చివరి అంతరిక్షయాత్రలో కూడా 9 నెలలు స్పేస్‌లో గడిపారు., స్పేస్‌లో మొత్తం 608 రోజులు గడపడం ద్వారా మహిళా వ్యోమగాముల కోసం ఒక పెద్ద రికార్డు సృష్టించారు. అంతేకాక, 62.06 గంటల స్పేస్ వాక్‌ ద్వారా సునీతా విలియమ్స్ అంతరిక్ష అన్వేషణలో తన ప్రతిభను ప్రపంచానికి చూపించారు. సునీతా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటనతో (Retirement Announcement) నాసా, అంతరిక్ష పరిశోధన రంగంలో (Space Research Sector) ఒక ప్రతిష్ఠాత్మక విరామం ఏర్పడింది. మహిళా వ్యోమగాముల కోసం స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణం, కొత్త తరం వ్యోమగాముల కోసం ప్రేరణగా మారింది. అంతరిక్షంలో అత్యంత ... Read more - [''నా పాదయాత్ర అప్ప‌టి నుంచే''.. - వైఎస్ జగన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌](https://telugufeed.com/ys-jagan-padayatra-announcement-ysrcp-meeting-eluru/): ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి (Eluru Assembly Constituency) చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరుతో ఈ తంతును తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. మరోసారి పాదయాత్రకు క్లారిటీరాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల చివర్లో లేదా మార్చి ప్రారంభంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని జగన్ తెలిపారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది కేవలం మరో రెండు బడ్జెట్లు, మూడేళ్ల పాలన మాత్రమేనని వ్యాఖ్యానించారు. అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే, ప్రజలతోనే ఉండేలా ... Read more - [ప్రతి రోజు ఒక్క కప్పు కరివేపాకు టీ… ఆరోగ్యం, ఎనర్జీ, రిలాక్స్‌ ఒకేసారి!](https://telugufeed.com/curry-leaf-tea-health-benefits/): మన రోజువారీ కూరల్లో కరివేపాకు ఆకులను (Curry Leaves) ఎక్కువగా పక్కన పెడతాం. కానీ తాజాగా కరివేపాకు టీ (Curry Leaves Tea) సౌత్ ఇండియాలో భారీగా ప్రాచుర్యం పొందుతోంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. 25-30 ఆకులను సుతిమెత్తగా కడిగి, ఒక కప్పు వేడి నీటిలో ఉంచి రేకపెట్టడం మాత్రమే. కప్పులో నీటి రంగు మారగానే ఫిల్టర్ చేసి తాగవచ్చు. తేనె, బెల్లం లేదా నిమ్మరసం కలుపుతూ కూడా రుచి పెంచుకోవచ్చు. ఈ సింపుల్ టీ, ఇప్పుడు దేశంలో చాలా మంది రోజూ వాడుతున్న ఒక హెల్తీ బేవరేజ్‌గా మారింది. కడుపు నుండి చర్మం వరకుకరివేపాకు టీ ప్రస్తుత కాలంలో మలబద్ధకం (Constipation), గ్యాస్ (Gas), మూత్ర సమస్యల (Urinary Problems) నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ మహిళలకు, ప్రయాణాల ... Read more - [అక్కడ తెలంగాణ వారి విగ్రహాలు ఎందుకు లేవు?](https://telugufeed.com/kavitha-telangana-statues-bc-reservation-municipal-elections/): తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కవిత (Kavitha) మున్సిపల్ ఎన్నికలకు ముందే కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్‌ (Tank Bund)లో తెలంగాణ వారి విగ్రహాలు (Telangana People Statues) లేవని గుర్తు చేసుకున్న ఆమె, ఆంధ్రా వారి విగ్రహాలు తీసేయాలని అడగడం కాదు, కానీ తెలంగాణ వారి విగ్రహాలు కూడా పెట్టాలన్న అంశాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేశారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) మాట లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల గురించి అధికారులు చర్చించకుండా దాటవేస్తున్నారని, ఈ నేపథ్యంలో గుంపు మేస్త్రి గుంట నక్క (Gumpu Mesthri Gunta Nakka)ను విచారణకు పిలవడం అసంబద్ధమని నిలదీశారు. అతీతంలో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసం పది ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేసిన కవిత, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) యువత, మహిళలు ... Read more - [కాశీ యాత్రతో మారిన నిధి అగర్వాల్?](https://telugufeed.com/nidhi-agarwal-spiritual-change-kashi-podcast-interview/): గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) సరసన ‘ది రాజా సాబ్’ వంటి భారీ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నిధి… ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనపై పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తన కెరీర్‌ను దెబ్బతీయడానికి డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. నటీనటులు చాలా ఎమోషనల్‌గా ఉంటారని, ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల వారి కుటుంబాలు కూడా తీవ్రంగా బాధపడతాయని నిధి ఆవేదన వ్యక్తం చేసింది. అదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఆమె ఖండించింది. వరుణ్ ధావన్ చాలా స్వీట్ వ్యక్తి అని, కో-స్టార్స్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాడని చెప్పింది. అలాగే ... Read more - [సీఎం సొంత జిల్లాలో గంజాయి బ్యాచ్ అరాచకం.. భయాందోళనలు](https://telugufeed.com/ganja-mafia-terror-chandragiri-cm-home-district-andhra-pradesh/): ముఖ్యమంత్రి (Chief Minister) సొంత జిల్లాలోనే గంజాయి మాఫియా (Ganja Mafia) అరాచకం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని (Chandragiri Constituency) రెడ్డివారిపల్లెలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ గ్రామంలో తిరుగుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ గుంపు, ఇటీవల ఒక ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా, టూ వీలర్‌కు నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల కథనం ప్రకారం, రెడ్డివారిపల్లెలో గంజాయి బ్యాచ్ తరచూ గొడవలకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తోంది. గతంలో లిక్విడ్ గంజాయి వ్యవహారం కూడా ఈ గ్రామంలో కలకలం రేపిందని, అప్పటి నుంచే కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ గ్రామ శాంతిని భంగం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా కోసం తిరుగుతూ గ్రామస్తులతో ఘర్షణలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు ... Read more - [భారత్–పాక్ యుద్ధం నేనే ఆపా! ట్రంప్ మరోసారి క్రెడిట్ క్లెయిమ్](https://telugufeed.com/trump-claims-credit-india-pakistan-war-stopped-operation-sindoor/): భారత్–పాకిస్థాన్ (India–Pakistan) యుద్ధాన్ని (War) తానే ఆపానంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి క్రెడిట్ తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఇరు దేశాలు అణ్వాయుధాల దాడికి సిద్ధమవుతున్నాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) తనకు స్వయంగా చెప్పారని ట్రంప్ వెల్లడించారు. వెంటనే వాణిజ్య సుంకాలు, ఆర్థిక హెచ్చరికలతో భారత్, పాకిస్థాన్‌లను బెదిరించి యుద్ధాన్ని నిలిపివేశానని చెప్పారు. మంగళవారం వైట్ హౌస్‌లో ప్రసంగించిన ట్రంప్… ‘‘10 నెలల్లో నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. భారత్–పాకిస్థాన్ అణ్వాయుధాల వైపు వెళ్లాయి. ఎనిమిది విమానాలు కూల్చివేయబడ్డాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించగా, పాకిస్థాన్ మాత్రం స్వాగతించింది. యుద్ధ విరమణ పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరిగిందని, మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి ... Read more - [500 మంది డాన్సర్లతో రామ్ చరణ్… ‘](https://telugufeed.com/ram-charan-peddi-mass-song-500-dancers-mysuru-shoot/): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది (Peddi)’ పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivrajkumar) కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మెగా ఫ్యాన్స్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, మైసూర్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఒక్క పాట కోసం ఏకంగా 500 మంది ప్రొఫెషనల్ ... Read more - [బీఆర్ఎస్ ద‌ళిత ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దాడి](https://telugufeed.com/congress-mp-mallu-ravi-attack-brs-mla-vijayudu-dalit-mla-telangana/): ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ దాడికి తెగ‌బ‌డిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో వివాదాస్ప‌దంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తి, అది భౌతిక దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Congress MP Mallu Ravi), అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి (Alampur BRS MLA Vijayudu)పై రెచ్చిపోయి దాడి చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి ముందుగా కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా, ప్రోటోకాల్ ... Read more - [ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్](https://telugufeed.com/ap-injustice-visakhapatnam-railway-zone-without-kk-line/): ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మ‌రోసారి తీరని అన్యాయం జరిగింది. రైల్వేజోన్‌లో అతి ముఖ్య‌మైన కేకే లైన్ (కోరాపుట్–కిరండుల్ లైన్) (KK Line – Koraput–Kirandul Line) లేకుండానే జోన్ స్వ‌రూపాన్ని కేంద్ర ప్ర‌క‌టించ‌డంపై ఏపీలో వివాదం మొద‌లైంది. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించింద‌ని, చంద్రబాబు (N. Chandrababu Naidu) ప్రభుత్వ నిర్ల‌క్ష్య విధానం కారణంగా విశాఖ రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone) కీలకమైన కేకే లైన్ లేకుండానే ఖరారైందని వైసీపీ(YSRCP)తో పాటు ఉత్త‌రాంధ్ర వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్‌ను ఈ జోన్‌లో చేర్చకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కేకే లైన్ ద్వారా ఏటా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక మార్గాన్ని కోల్పోవడం వల్ల విశాఖ జోన్ ప్రయోజనం కోల్పోయింది. ఉత్తరాంధ్ర ప్రజలు, ... Read more - [హైదరాబాద్‌లో ఏటా WEF ఫాలో-అప్ ఫోరం!](https://telugufeed.com/hyderabad-annual-wef-follow-up-forum-revanth-reddy-davos/): సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్‌ను గట్టిగా నిలబెట్టారు. దావోస్‌ (Davos)లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ (Join the Rise) కార్యక్రమంలో ఆయన చేసిన కీలక ప్రతిపాదనకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలన్న సూచన పెట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, ఇప్పుడు తెలంగాణ విజన్‌ను ప్రపంచానికి చూపించేందుకే దావోస్‌కు వచ్చామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCCs) హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ... Read more ## Pages - [Notifications](https://telugufeed.com/pushnotification/) - [English](https://telugufeed.com/english/): Breaking News Movies Web Stories National News - [Disclaimer](https://telugufeed.com/disclaimer/): The content on Telugu Feed is for informational purposes only. Our efforts in ensuring the accuracy of the contents fail us; hence, we shall not be held liable for any error in facts, or omissions. The opinions on this site, especially articles of opinion, are those of the authors and do not necessarily state or reflect the views we hold. In no event shall we be liable for any losses or damages arising in any way from the use of information on this site. Should you wish to rely on any information from this site, you will be taking that ... Read more - [Terms and Conditions](https://telugufeed.com/terms-and-conditions/): By accessing and using Telugu Feed, you agree to the following terms: For any concerns regarding these terms, please contact us. - [Privacy Policy](https://telugufeed.com/privacy-policy/): At Telugu Feed, we respect your privacy and are committed to protecting your personal information. This policy outlines how we collect, use, and safeguard your data: For any privacy concerns, contact us at telugufeedsite@gmail.com. - [Contact Us](https://telugufeed.com/contact-us/): For any inquiries, feedback, or collaborations, feel free to reach out to us: 📧 Email: telugufeedsite@gmail.com🌐 Website: www.telugufeed.com We value your opinions and are always eager to hear from our readers! - [About Us](https://telugufeed.com/about-us/): Telugu Feed offers up-to-date Telugu news, insightful updates, and information. It specializes in providing news that comes quickly and delivers authentic information from all over India – politics, entertainment, sports, technology, and more. Keep updated Telugu readers with factual and also productive content. Telugu Feed is meant for serious journalists. Each article is thoroughly researched, fact-checked, and then published. Stay in touch to get daily updates and analyses on hot issues. [comment]: # (Generated by Hostinger Tools Plugin)