తెలంగాణ (Telangana) కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. జయలక్ష్మీ సినిమాస్ (Jayalakshmi Cinemas) పేరుతో కొత్త సినిమా ఆఫీస్ (New Film Office) ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 సెకన్ల నిడివి గల టీజర్ (Teaser) ను విడుదల చేశారు. జగ్గారెడ్డి కథనే సినిమాగా తెరకెక్కించబోతున్నారు.
దర్శకుడు రామానుజం (Ramanujam) ఈ సినిమాను జగ్గారెడ్డి జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, “ఏ వార్ ఆఫ్ లవ్ (“A War of Love”)” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగ్గారెడ్డే హీరోగా నటిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా విజయవంతమైన ఆయన, నటుడిగా ఎంతవరకు మెప్పిస్తారో వేచిచూడాలి.








