కేంద్ర ప్రభుత్వం (Central Government) మధ్యతరగతి (Middle-Class), దిగువ (Lower) ఆదాయ కుటుంబాలకు (Income Families) శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ (GST) స్లాబుల (Slabs) పునర్నిర్మాణం (Restructuring)పై తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, 12 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా తొలగించడంపై చర్చలు జరుగుతున్నాయి.
ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి?
ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న వస్తువుల్లో ఎక్కువ భాగం పేద, మధ్యతరగతి పౌరులు రోజువారీ జీవితంలో ఉపయోగించేవే. ఈ వస్తువులను 12 శాతం నుంచి 5 శాతం పన్ను స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.
మరో ప్రత్యామ్నాయంగా, 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి, అందులో ఉన్న వస్తువులను ఇప్పటికే ఉన్న తక్కువ లేదా అంతకంటే ఎక్కువ స్లాబ్‌లలోకి చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 శాతం పన్ను స్లాబులో ఉన్న కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి:
వెన్న, నెయ్యి, ప్రాసెస్ చేసిన ఆహారం, బాదం, మొబైల్స్, పండ్ల రసం, కూరగాయలు, పండ్లు, గింజలు లేదా మొక్కల ఇతర భాగాలు, ఊరగాయతో సహా మురబ్బా, చట్నీ, జామ్, జెల్లీ, ప్యాక్ చేసిన కొబ్బరి నీరు, గొడుగు వీటిలో ఏ వస్తువులను 5 శాతంలోకి తెస్తారు. 12 శాతం కంటే ఎక్కువ పన్ను స్లాబులోకి చేరుస్తారో వేచి చూడాలి.
త్వరలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ..
త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting)లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా, కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజుల నోటీసు అవసరం, అయినప్పటికీ ఈ నెలాఖరులో సెషన్ జరగవచ్చని సమాచారం.
ఒకవేళ ఈ స్లాబుల మార్పు చేస్తే, ఇది రాజకీయంగా అత్యంత కీలక అంశంగా మారనుంది. ఎన్నికలకు ముందు, ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. ఇది ఆయా వస్తువులపై ఉన్న ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు పన్ను రేట్లలో మార్పులను సిఫార్సు చేసే అధికారం ఉంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, 2017లో పరోక్ష పన్ను వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుండి జీఎస్టీ రేట్లలో ఇది అత్యంత ముఖ్యమైన సవరణలలో ఒకటిగా నిలుస్తుంది.







