గ్రేట‌ర్‌ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్

గ్రేట‌ర్‌ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్

హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమ‌వుతోంద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాల మట్టం భారీగా తగ్గిపోతోంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గిన అగ్రరాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. 15 శాతం అదనపు వర్షపాతం వచ్చినా 1.33 మీటర్ల భూగర్భ జలాల మట్టం పతనమైందని, కూకట్‌పల్లిలో 25.90 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని చెప్పారు.

మిషన్ భగీరథ, కాకతీయపై కీల‌క వ్యాఖ్య‌లు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలోనూ చెరువులు నిండుగా ఉండేవి అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు నీటి కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్న దుస్థితి ఏర్పడిందని హరీశ్ రావు ఆరోపించారు. చెరువులు ఎండిపోతోంటే ప్రభుత్వం మాత్రం ప్రచారంలో మునిగిపోయిందని విమ‌ర్శించారు. పాలనపై దృష్టి లేకుండా రాజకీయ కక్ష సాధింపుతో బిజీగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ మంచి నీటి కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించకుండా తప్పించుకుంటోందని హరీశ్ రావు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment