కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు వాపోయారు.
మిషన్ భగీరథ వైఫల్యం
వేసవి వేళల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, దాని ఫలితంగా మారుమూల ప్రాంతాల ప్రజలు బిందెలతో వాగులు, వ్యవసాయ బావుల నుంచి నీళ్లను తెచ్చుకునే దుస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పథకాల అమలు, పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథను సరిగ్గా కొనసాగించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని హరీశ్ రావు మండిపడ్డారు.
అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 7, 2025
ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం.
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వేసవి వేళ మారుమూల ప్రజలకు శాపంగా మారింది.… pic.twitter.com/5ViKUmoG8S








