“ఓ మహాత్మా మన్నించు”.. గాంధీ విగ్రహం దీన‌స్థితిపై హరీశ్ ఆగ్ర‌హం

“ఓ మహాత్మా మన్నించు”.. గాంధీ విగ్రహం దీన‌స్థితిపై హరీశ్ ఆగ్ర‌హం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించిన గాంధీ కాంస్య విగ్రహం, ఇప్పుడు నిర్వహణ లోపం కార‌ణం దీన స్థితిలో ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఓ మహాత్మా మన్నించు” అంటూ ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు.

2022 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను చెరిపేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ క్రమంలోనే గాంధీ విగ్రహం నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీజీ ఆశయాల పట్ల గౌరవం లేదని ఆరోపించారు.

గాంధీ సిద్ధాంతం “చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు” అయితే, రేవంత్ రెడ్డి మాత్రం “చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు” అనే విధానాన్ని అవలంభిస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గాంధీ ఆశయాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, బాపు ఘాట్ పునరుద్దరణ పేరిట పెద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment