పవన్ సినిమాకు ఏపీలో ప్రత్యేక అనుమతులు

పవన్ సినిమాకు ఏపీలో ప్రత్యేక అనుమతులు

న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Harihara Veeramallu) సినిమా (Movie) విడుద‌ల‌కు (Release) సిద్ధ‌మైంది. ఈనెల 24న సినిమా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ (AP)లోని కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ఈ సినిమాకు స్పెష‌ల్ ప‌ర్మిష‌న్స్ (Special Permissions) మంజూరుచేసింది. జూలై 23న రాత్రి 9 గంట‌ల‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టించిన “హరిహర వీరమల్లు” (Harihara Veeramallu) సినిమా ప్రీమియర్ షో (Premiere Shows)లకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు (Benefit Shows), టిక్కెట్ ధరలు (Ticket Prices) పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వం బెన్‌ఫిట్ షోల‌ను ర‌ద్దు చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక గ‌త 13 నెలలుగా ఏ సినిమాకూ ప్రీమియ‌ర్ షోకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మల్లుకు మాత్ర‌మే బెనిఫిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి మంజూరైంది.

టిక్కెట్ ధరలు పెంపు
హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా టికెట్ ధ‌ర‌లను సైతం పెంచుకునే వెసులుబాటు కూట‌మి ప్ర‌భుత్వం క‌ల్పించింది. మల్టీప్లెక్స్ లలో రూ.200, అప్పర్ క్లాస్ టిక్కెట్లు రూ.150, లోయర్ క్లాస్ టిక్కెట్లు రూ.100గా అదనంగా వసూలు చేయేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పెరిగిన టికెట్ ధరలు 10 రోజుల పాటు అమ‌లులో ఉండ‌నున్నాయి.

పవన్ కళ్యాణ్ గత వ్యాఖ్యలపై విమర్శలు
ఇటీవ‌లే పవన్ కళ్యాణ్ థియేటర్లలో టిక్కెట్ ధరలు, తినుబండారాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన ప్రభుత్వ యంత్రాంగంతో థియేటర్లపై తనిఖీలు చేయించారు. కానీ ఇప్పుడు తన సినిమాకే భారీ ధరలు వసూలు చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సొమ్ము తింటున్నారంటూ నాడు మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన సినిమా వచ్చేసరికి మాత్రం ప్రత్యేక వెసులుబాట్లు క‌ల్పించుకోవ‌డం ద్వంద్వ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment