జీఎస్టీ (GST) పేరుతో ప్రజల సొమ్ము ఇన్నాళ్లూ లూటీ చేసి.. కార్పొరేట్లకు (Corporates) తొమ్మిది సంవత్సరాల పాటు దోచిపెట్టి ఇప్పుడు స్లాబ్ మార్పులు చేస్తూ మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం (Central Government)పై సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) విమర్శించారు. జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూటమి (Alliance), బీజేపీ(BJP) ప్రభుత్వం (Government)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడుతూ.. “భారత్(India) లాంటి దేశాన్ని భయపెట్టడం జరగదని పుతిన్(Putin) అన్నారు. కానీ మోడీ (Modi) మాత్రం ట్రంప్(Trump)ను చూసి భయపడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై కూడా దూకుడు ప్రదర్శించారు. “ఓ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమిత్ షా, నక్సల్స్ (Naxals)ను చంపుతామని అంటున్నారు. గిరిజనుల ఆస్తుల కోసం నక్సల్స్‌ను చంపుతామనడం తప్పు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కూడా ఆపరేషన్ ఖగార్ (Operation Kagar) పేరుతో తొలగిస్తున్నారు” అని ఆరోపించారు.
రాష్ట్ర రాజకీయాలపై కూడా నారాయణ స్పందించారు. “ఏపీలో ఉన్న పార్టీలు అన్నీ మోడీకి దాసోహం అయ్యాయి. బీజేపీతో చేతులు కలిపిన పార్టీలు దేశంలో ఎక్కడా నిలబడలేకపోతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ రెండుగా చీలింది. బీజేపీ భస్మాసుర హస్తం, దీనికి టీడీపీ(TDP), జనసేన(Janasena) కూడా మినహాయింపు కాదు” అని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంపే యత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్టరీని బలహీనపరిచి అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లాంట్‌ను సెయిల్ (SAIL)కి అప్పజెప్పాలి” అని డిమాండ్ చేశారు.







