భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం రూ.332 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, రూ.51 కోట్లతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు.

అదే సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ.15 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. నివేదిక ప్రకారం, మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ సుమారు రూ.1,630 కోట్లు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు రూ.931 కోట్లతో దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ సీఎంగా మొదటి స్థానంలో నిలిచారు.
కాగా, తన రాజకీయ ప్రస్థానంలో రెండు ఎకరాలతో మొదలై.. ప్రస్తుతంలో దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలవడంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. దీన్ని కూడా సంపద సృష్టి అంటారా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.







