బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)పై మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. హరీష్ రావు అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
చక్రధర్ గౌడ్ తనకు హరీష్ రావు అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన హరీష్ రావు అనుచరులు వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పర్శరాములు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా, చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హరీష్‌రావుపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావును A-2గా చేర్చారు. 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి దీనిపై హరీష్‌రావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.








