రాజాసింగ్ రాజీనామా ఆమోదం

రాజాసింగ్ రాజీనామా ఆమోదం

తెలంగాణ (Telangana)లో బీజేపీ(BJP)లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA), సీనియ‌ర్ నాయ‌కుడు రాజాసింగ్ (Raja Singh) పార్టీకి ఇచ్చిన రాజీనామాను (Resignation) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  (JP Nadda) అధికారికంగా ఆమోదించారు (Approved). రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి అనుసరించిన విధానం త‌ప్పు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకు నిర‌స‌న‌గా ఆయన తన రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి అందజేశారు. అనంతరం, ఆ లేఖను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు పంపించాలని సూచించారు.

రాజీనామా అనంత‌రం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళితే తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు. “అధ్యక్షుడు ఎవరు కావాలనేది ముందే డిసైడ్ చేసిన తర్వాత ఎన్నిక ప్రక్రియను నాటకీయంగా చేపట్టారు. ఇది పారదర్శకత లేని ప్రక్రియ” అని ఆయన విమర్శించారు. తెలంగాణ బీజేపీలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, కొందరు నాయకులు పార్టీ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నార‌ని ఆరోపించారు.

రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించ‌డంతో తెలంగాణ‌లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కావాల‌నే కొంద‌రు ఆయ‌న్ను బీజేపీ నుంచి త‌ప్పించేలా చేశార‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న స‌మ‌యంలో ఇలాంటి ప‌రిణామం మంచిది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజాసింగ్ ఇప్పుడు ఏ పార్టీలో చేరుతార‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment