తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విశేషమైన గుర్తింపు పొందిన బాలాపూర్ (Balapur) వినాయక లడ్డూ (Vinayaka Laddu) ఈ ఏడాది కూడా రికార్డు ధరకు విక్రయమైంది. నవరాత్రి వేడుకల అనంతరం నిర్వహించిన సాంప్రదాయ వేలంపాటలో భక్తులు లడ్డూను దక్కించుకునేందుకు ఆసక్తి చూపారు.
ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.35 లక్షలకు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ (Lingala Dasharath Goud) లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది లడ్డూ రూ.30 లక్షల 1 రూపాయికి అమ్ముడవగా, ఈసారి దాదాపు రూ.4.99 లక్షలు అధికంగా పలికింది.
ప్రతీ ఏడాది లడ్డూ ధర పెరుగుతూ కొత్త రికార్డులు నెలకొల్పుతుండగా, ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ వేలంపాట చర్చనీయాంశంగా మారింది. భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణేశుడి ప్రసాదం దక్కించుకోవడం, ఆ లడ్డూ దక్కిన వారికీ అదృష్టం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.








