ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో ప్రారంభంకానున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో, తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం (Gopalapuram) ఎమ్మెల్యే మద్దిపాటి (Maddipati) వెంకటరాజు (Venkataraju) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “భర్తలు విసుక్కుంటే పడొద్దు.. ఫ్రీ బస్సు (Free Bus) ఎక్కి హ్యాపీగా పుట్టింటికి వెళ్లిపోండి. మగాళ్లే టికెట్లు వేసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అనే ఆయన వ్యాఖ్యలు అప్పుడు ఆ సభలో నవ్వులు పంచినా, సోషల్ మీడియాలో మాత్రం ఆగ్రహాలు రేకెత్తుతున్నాయి.
స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకం
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా ఆర్టీసీ(RTC) బస్సుల్లో ప్రయాణించే అవకాశం కలగనుంది. ఈనేపథ్యంతో ద్వారకాతిరుమల (Dwaraka Tirumala) మండలం తిరుమలపాలెం (Tirumalapalem) లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ సభలో ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ “ఇప్పుడు మహిళలకు ఆత్మగౌరవం పెరిగింది. భర్తలు కసురుకుంటే, బాధ పడుతూ పడుకోవాల్సిన అవసరం లేదు. ఉచిత బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్లిపోవచ్చు. తర్వాత వాళ్లే చార్జీలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉచిత బస్సులను సంసారాల్లో కలహాలకు సాధనంగా మార్చాలా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా, మహిళలు–భర్తల మధ్య విభేదాలను ప్రోత్సహించేలా ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఎమ్మెల్యే గారూ మీరు కూడా అలాగే చేస్తారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.







