ఏపీ కేబినెట్‌ భేటీ.. ముగ్గురు మంత్రుల డుమ్మా

ఏపీ కేబినెట్‌ భేటీ.. ముగ్గురు మంత్రుల డుమ్మా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. మొత్తం 31 అంశాలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్ర‌ధానంగా అమరావతి (Amaravati) రాజధానిపై చట్టబద్ధత చర్చకు వచ్చాయి. రాష్ట్ర‌ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపే యోచనలో ఉంది.

ఇదిలా ఉండగా, ఈ కేబినెట్‌ భేటీకి ముగ్గురు ముఖ్యమైన మంత్రులు డుమ్మా కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ తిరుపతి జిల్లాలో పర్యటనలో ఉన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ (LG Electronics) కంపెనీకి భూమిపూజ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ (Satyakumar Yadav) విదేశీ పర్యటనలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్‌ (Payyavula Keshav).. రేపు సీఎం చంద్రబాబు ఉరవకొండ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఆయన కూడా ఈ రోజు కేబినెట్‌ భేటీకి దూరంగా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment