సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Lokesh) తీరుపై వైసీపీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందుల (Pulivendula) ఎన్నికల ఫలితాలు (Election Results), రాజకీయ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ”పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందట.. ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదు. పులివెందులలో ప్రతి ఓటర్‌కి సిరా చుక్కలు చూపించగలరా..? జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ కూడా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారని మేమే ఆధారాలతో చూపిస్తాం” అని అంబటి ఛాలెంజ్ విసిరారు.
లోకేష్‌పై కూడా మండిపడిన అంబటి.. “కోతలు కోయడం మానేసి, మీ ఇంటి శంకుస్థాపనకు మీ మేనత్తలను పిలిచారా? మీ నాన్న మీ బాబాయిని ఎలా చూశారో అందరూ చూశారు” అని ఎద్దేవా చేశారు. రాఖీ పండక్కి మీ మేనత్తలు వచ్చి మీ నాన్నకి రాఖీ (Rakhi) కట్టారా..? కడితే పట్టుచీర పెట్టారా..? మామూలు చీర పెట్టారా..? అని నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. ఎన్నికల తర్వాత 12.5% ఓట్లు పెరిగిన రహస్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ, “మీరు నిజాయితీగా ఎన్నికలు చేస్తే పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు ఈ తేడా రావడమేంటి? పవన్(Pavan) సమాధానం చెప్పాలి” అని అన్నారు.
వైఎస్ జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలు వాస్తవమని అన్నారు అంబటి రాంబాబు. “చంద్రబాబు(Chandrababu), రేవంత్(Revanth), రాహుల్ (Rahul) హాట్‌లైన్ (Hotline)లో ఉన్నారు” అన్న వ్యాఖ్యలు పూర్తిగా నిజమని అంబటి మద్దతు తెలిపారు. “చంద్రబాబుకు సిద్ధాంతం, నిబద్ధత లేవు. అవసరమైతే బీజేపీ(BJP)కి వెళ్తారు, తర్వాత కాంగ్రెస్ అంటారు, మళ్లీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తారు. ఎప్పుడూ ఎటైనా అవతారం ఎత్తుతారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.








