తమిళ సినీ ఇండస్ట్రీ (Tamil Film Industry) లో మరోసారి తనదైన ముద్ర వేసాడు తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). ఆయన నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’ తాజాగా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని (Blockbuster Success) సొంతం చేసుకుంది. విడుదలైన వెంటనే మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
మొదటి వారంలోనే ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో ఇది రూ.170 కోట్ల మార్క్ చేరుకుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, త్వరలోనే ఇది రూ.200 కోట్లు దాటనుంది. అజిత్ మాస్ ఫాలోయింగ్‌తో పాటు, ఈ సినిమాకు ఉన్న సాంకేతిక విలువలు, యాక్షన్ సీన్లు, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ఈ సినిమా విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా చెప్పొచ్చ అంటున్నారు తలా ఫ్యాన్స్.







